యామీ గౌతమ్.(yami gautam ) ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్.
ఈ యాడ్ తో భారీగా గుర్తింపు తెచ్చుకుంది యామీ గౌతమ్.చాలామంది యామి గౌతమ్(yami gautam) అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఫెయిర్ అండ్ లవ్లీ హీరోయిన్ అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.
అంతలా ఈ ఈ యాడ్ తో గుర్తింపు తెచ్చుకుంది.సినిమాల ద్వారా కంటే ఈమె యాడ్స్ ద్వారానే బాగా పాపులర్ అయిందని చెప్పాలి.
ఆ సంగతి పక్కన పెడితే తాజాగా యామీ గౌతమ్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.సోషల్ మీడియా గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి నాకు బాగా తెలుసు.
నాకూ సోషల్ మీడియా అకౌంట్ ఉంది.కానీ నేను బ్రేక్‌ఫాస్ట్ (Breakfast)ఏం చేశాను.జిమ్‌లో గాయపడ్డాను.ఇలాంటి చిన్న చిన్న విషయాలను అందరితో షేర్ చేసుకోను.
నేను వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పను.అలా పంచుకోవడం నాకు నచ్చదు.
అంత అవసరం కూడా లేదని నా అభిప్రాయం.నా గురించి ప్రజలు ఆలోచించాలని నేను కోరుకోవడం లేదు.
వాళ్లకు ఎంత తక్కువ తెలిస్తే నేను పోషించే పాత్రకు ప్రేక్షకులు అంత ఎక్కువ కనెక్ట్ అవుతారు అని అన్నారు.తరువాత కుమారుడి గురించి మాట్లాడుతూ.

వాడిని మీడియాకు దూరంగా పెంచాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.అది కూడా తాను తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని ఆమె అన్నారు.అతడు ఒక సెలబ్రిటీ కుమారుడిలా కాకుండా సాధారణంగా పెరగాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.ఇకపోతే ఈమె విషయానికి వస్తే.ఈమె మొదట నువ్విలా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.తర్వాత బాలీవుడ్ మూవీలలో కూడా నటించే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అలా టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె గౌతమ్.సినిమాల కంటే టెలివిజన్ ప్రకటనలతోనే ఎక్కువ పాపులర్ అయ్యిందని చెప్పాలి.