సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న నటీమణులలో సిల్క్ స్మిత ఒకటి.ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీ లైఫ్ ను లీడ్ చేసిన నటి సిల్క్ స్మిత.
ఉన్నత శిఖరాలను అవరోహించే క్రమంలో ఒక్కసారిగా కిందకు పడిపోయింది.తాను నమ్మిన వాళ్లే తనను మోసం చేసారని తెలిసి తట్టుకోలేకపోయింది.
అసిస్టెంట్ గా దారికి చేరిన మగాడు తన మాయమాటలతో సిల్క్ స్మితను లొంగదీసుకుని, చివరికి తన మీద పెత్తనం చేసి సిల్క్ స్మిత జీవితాన్ని ఒక చిత్తు కాగితంలా మార్చేశాడు.ఇవన్నీ తట్టుకోలేక, మానసికంగా కృంగిపోయిన సిల్క్ స్మిత చివరికి ఆత్మహత్య చేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
అయితే సిల్క్ స్మిత జీవిత ప్రయాణంలో మొదటి నుండి అన్ని తానై ఉన్న ఒకే ఒక మహిళ అన్నపూర్ణమ్మ.సిల్క్ స్మితను తన చిన్నతనంలోనే దత్తత తీసుకుంది.
పదేళ్ల వయసులోనే చిత్ర సీమపై మనసు పారేసుకున్న సిల్క్ స్మిత కోరికను గమనించిన ఆమె పెద్దమ్మ అన్నపూర్ణమ్మ సిల్క్ స్మితను ఒక నటిగా చేయాలనీ గుంటూరు నుండి చెన్నై వరకు ఆమెను చేర్చింది. మధ్యలో ఎన్నో ఆటంకాలు, అగచాట్లు భరించింది.
ఛాయాదేవి కి అసిస్టెంట్ గా, పని మనిషిగా కూడా బ్రతికింది సిల్క్ స్మిత.సిల్క్ స్మిత పెద్దమ్మ అయిన అన్నపూర్ణమ్మ ఇళ్లల్లో పాచి పనులు కూడా చేసింది.ఒకసారి తాడికొండ లో ఒక షూటింగ్ జరుగుతుండగా అక్కడ అవకాశం కోసం అన్నపూర్ణమ్మ సిల్క్ స్మిత ఇద్దరు వెళ్లారట.అక్కడ మూడు రోజుల పాటు ఏమి తినకుండా పస్తులు కూడా ఉన్నారు.
తరువాత మెల్లగా ఎలాగోలా సిల్క్ స్మిత కి అవకాశాలు వచ్చాయి, డబ్బు, పేరు, పలుకుబడి అన్ని వచ్చాయి.వాటితో పాటే చుట్టూ మోసగాళ్లు, ప్రేమ పేరుతో వాడుకునే వాళ్ళు , అవకాశం ఇస్తా అని పక్కలోకి రమ్మనే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు.
ఇవన్నీ అన్నపూర్ణమ్మ కు తెలిసిన గాని ఏమి చేయలేకపోయింది.ఇద్దరు కలిసి అంచెలంచెలుగా చిన్న అద్దె ఇంటి నుండి పెద్ద ఇంటికి, చివరగా సొంత బంగ్లాకు చేరుకున్నారు.
అన్నపూర్ణమ్మ మాత్రం సిల్క్ స్మిత వెంబటే ఉంటూ తనకు ఏం కావాలో అన్ని దగ్గరుండి చూసుకునేది.
ఒక్కోసారి సిల్క్ స్మిత కోపంలో అన్నపూర్ణ మీద చిరాకు పడ్డగాని పల్లెత్తు మాట అనేది కాదు.చివరికి ఒక నడి వయసున్న, అందులోను పెళ్లి, అయ్యి, భార్య, పిల్లలు ఉన్న అబ్బాయిని ప్రేమిస్తున్న అంటే కూడా సరే అంది.అతడిని అతడి పెళ్ళాం పిల్లలను ఇంట్లో తెచ్చి పెట్టిన తలూపింది కానీ వద్దు అని ఎప్పుడు చెప్పలేదు.
అయితే అన్నపూర్ణ ఆరోజే సిల్క్ స్మితను నయానో భయానో మందలించి ఉంటే ఈ రోజు ఆమె మన మధ్యలోనే ఉండేది.మొదట్లో అన్ని అధికారాలు అన్నపూర్ణమ్మ చేతిలోనే ఉండేవి.
కానీ మెల్లిగా ఇంటిని, డబ్బును, ఆస్తులను సిల్క్ స్మిత ప్రేమికుడు దోచేస్తుంటే అన్నపూర్ణమ్మ అడ్డు చెప్పలేదు.చివరికి సిల్క్ కూడా ఆ మైకం నుండి బయటకు రాలేదు.
ఒక్కోసారి అన్నపూర్ణమ్మ అడ్డు చెప్పిన సిల్క్ వినే పరిస్థితిలో ఉండేది కాదు.
ఎందుకంటే అంతలా అతగాడి మాయలో పడిపోయింది.చివరాఖరికి అన్ని పోగొట్టుకుని, చేసిన తప్పు ఏంటో తెలుసుకుని ఆమెను పెంచి పెద్ద చేసిన అన్నపూర్ణమ్మ వొళ్ళో తల పెట్టి బాగా ఏడ్చేది సిల్క్. సిల్క్ స్మిత చనిపోవాలని అనుకున్నప్పుడు అన్నపూర్ణమ్మ ఇంట్లోనే ఉండి ఉంటే సిల్క్ స్మిత చనిపోయేది కాదేమో… కానీ సిల్క్ తాను చనిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత అన్నపూర్ణమ్మను వూరికి వెళ్లిరమ్మని చెప్పి పంపింది.
ఆమె ఊరు వెళ్లిపోయింది. ఆమె వచ్చేలోగా సిల్క్ తన జీవితాన్ని తానే బలవంతంగా తాడుతో బిగించుకుని మరి తుది శ్వాస విడిచింది.ఇలా సిల్క్ ప్రయాణంలో ఎవరికీ తెలియని ఆత్మబంధువు అన్నపూర్ణమ్మ .సిల్క్ కన్ను మూసినా రోజు ఆమె పక్కన ఒక అన్నపూర్ణమ్మ మాత్రమే ఉంది.సిల్క్ చనిపోయాక ఆమె కూడా ఒంటరిది అయిపోయింది.!!
.