అదృష్టం ఉంటే చిట్టడివిలో ఉన్నా చికెన్ కబాబ్ దొరుకుతుందట.ఇదేం పోలిక అంటారా పాత పోలికలు పోల్చి పోల్చి బోరు కొట్టింది అందుకే ఇలా కొత్తగా.
సరే అసలు విషయం ఏమిటంటే.సెల్స్ మెన్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తికీ అతడు పడుతున్న కష్టాలకు తట్టుకోలేని కోట్ల రూపాయలు కరుణించానులే అంటూ అతడి ఖాతాలోకి వచ్చి పడ్డాయి.
ఇంకా అర్థం కాలేదా.ఇక డీటైల్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం.
అబుదాబిలోని అంటే దుబాయ్ లో ఉండే ఓ భారతీయుడుకి అదృష్టం సుడులు తిరిగి లాటరీ రూపంలో తగిలింది…
అతడి పేరు జాకబ్స్.దుబాయ్ లోని అబుదాబిలో భార్యా, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు.
పొట్టకూటి కోసం వైద్య పరికరాల కంపెనీలో సెల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు.ఒక రోజు తన కుటుంభంతో కలిసి సరదాగా బయటకి వెళ్ళిన జాకబ్స్ లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు.
గడించిన రెండేళ్లుగా ఆన్లైన్ లో బిగ్ టిక్కెట్ లాటరీ కొన్న జాకబ్స్ చివరి సారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు.భార్య వద్దని చెప్పినా లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు.
ఇక అదే తన చివరి ప్రయత్నం అనుకున్నాడు.
ఊహించని విధంగా ఓ రోజు లాటరీ నిర్వాహకుల నుంచి జాకబ్స్ కు ఫోన్ వచ్చింది.మీరు కొన్న టిక్కెట్టుకు మొదటి బహుమతి వచ్చిందని చెప్పారు.కానీ జాకబ్స్ అవి నమ్మలేదు.స్నేహితులు ఆటపట్టిస్తున్నారు అనుకున్నాడు.కానీ చివరికి అదే నిజమని తెలుసుకుని ఎగిరి గంతేశాడు.తాను కొన్న లాటరీ టిక్కెట్టు పై అతడు గెలుచుకున్న సొమ్ము ఎంతో తెలుసా.12 మిలియన్ దిర్హమ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీ లో అక్షరాలా రూ.24 కోట్ల 18 లక్షలు.ఏంటి షాక్ అయ్యారా అవును అతడు గెలుచుకున్న సొమ్ము రూ.24 కోట్లు.ఈ మొత్తం డబ్బుతో జాకబ్స్ ఏమి చేయాలని అనుకుంటున్నాడో తెలుసా.తన ఆర్ధిక అవసరాలు తీర్చుకుని, ఇద్దరి పిల్లల చదువుకు, తాను కొత్త ఇల్లు కట్టుకునేందుకు, అలాగే పేద పిల్లల కోసం ఖర్చు చేస్తానని తెలిపాడు.
జాకబ్స్ నిజంగా లక్కీ కదా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.