మన శరీర ఆరోగ్యాన్ని కాపాడేందుకు పోషకాలు ఎంతో ముఖ్యపాత్రను పోషిస్తాయి.ఎప్పుడైతే పోషకాలు సక్రమంగా అందుతాయో మన ఆరోగ్యం కూడా అప్పుడే బాగుంటుంది.
మనలో చాలామంది ఏదైనా ఆరోగ్య సమస్యలకు గురవ్వగానే బలం కోసం పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం మొదలుపెడతారు.అలా సమస్యకు లోనైనప్పుడు కాకుండా ముందుగానే జాగ్రత్తగా పడడం ఎంతో మంచిది అని ఆహార నిపుణులు చెబుతున్నారు.
అందువల్ల పోషకాలు ఎక్కువగా ఉండే పప్పు ధాన్యాలు, శనగలు, వేరుశనగలు తీసుకోవాలని ఆరోగ్య పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా మార్కెట్లో విరివిగా లభించే శనగలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
శనగల్లో నాటు శనగలు, కబూలి శనగలు, ఆకుపచ్చ రంగులో ఉండే శనగలు కూడా ఉంటాయి.శనగలతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మాంసంలో ఉన్న పోషకాలని శనగలలో కూడా పుష్కలంగా ఉంటాయని అందుకే వీటిని పేదోడి బాదం అని కూడా అంటారని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా కొన్ని శనగలను నానబెట్టి మొలకలు వచ్చాక పచ్చివి తిన్న వేయించుకొని, ఉడికించుకొని తిన్న ఆరోగ్యానికి ఎంతో మంచిది.శనగల చాట్ అయితే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.శనగల్లో క్యాల్షియం, విటమిన్ ఏ, బి, సి, ఈ, ఫోలేట్, మెగ్నీషియం ఫాస్ఫరస్ సెలీనియం ఫైబర్ ఐరన్ వంటి ఎన్నో పుస్తకాలు ఎక్కువగా ఉంటాయి.
ఎముకలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు రాకుండా మనల్ని శనగలు కాపాడుతాయి.క్యాల్షియం లోపంతో బాధపడే వారికి ఈ శనగలు మంచి ఆహారం అని చెప్పవచ్చు.శనిగలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శనగలను ఆహారంలో తీసుకోవడం వలన ఐరన్, ప్రోటీన్, మినరల్స్ శరీరానికి శక్తిని అందిస్తాయి.దీనివల్ల అలసట, నీరసం, నిస్సత్తువా వంటివి దరిచెరువు.శనగలలో పీచు సమృద్ధిగా ఉండడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గు మొహం పడతాయి.
దీని వల్ల గుండె సంబంధం రాకుండా ఉండడమే కాక అధిక బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి.మధుమోహంలో బాధపడేవారు రోజు గుప్పెడు నానబెట్టిన శనగలు తింటే రక్తంలోని చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
అందుకే శనగలను మాంసంతో సమానమైన పోషకాలు కలిగిన తృణధాన్యాలు అని చెబుతారు.