అధిక ఒత్తిడి నుంచి క్షణాల్లో బయటపడేసే సూపర్ డ్రింక్ ఇది.. రోజు తాగితే మరిన్ని బెనిఫిట్స్!

ఒత్తిడి.సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.అయితే ఒత్తిడి అనేది చిన్న సమస్య.కానీ చాలా ప్రమాదకరం.దాన్ని నిర్లక్ష్యం చేస్తే నిలువెత్తు మనిషిని సైతం చిత్తు చిత్తు చేసేస్తుంది.అందుకే ఒత్తిడికి గురైనప్పుడు వీలైనంత త్వరగా దాని నుంచి బయటపడటం కోసం ప్రయత్నించాలి.

 This Is A Super Drink That Can Get Rid Of Stress In Moments-TeluguStop.com

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ సూపర్ గా సహాయపడుతుంది.ఈ డ్రింక్ ను ప్రతిరోజూ తీసుకుంటే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం అధిక ఒత్తిడి నుంచి క్షణాల్లో బయటపడేసే ఆ సూపర్ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.

ముందుగా అర అంగుళం అల్లం ముక్కను తీసుకుని పీల్‌ తొలగించి సన్నగా తురుముకుని పెట్టుకోవాలి.

అలాగే అర అంగుళం పచ్చి పసుపు కొమ్మును తీసుకుని తొక్కను చెక్కేసి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో అల్లం తురుము, పసుపు కొమ్ము తురుము వేసుకోవాలి.అలాగే చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి కనీసం ప‌ది నిమిషాల పాటు మరిగించాలి.

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె ను మిక్స్ చేస్తే మన డ్రింక్ సిద్ధమవుతుంది.ఒత్తిడికి గురైనప్పుడు ఈ డ్రింక్ ను తీసుకుంటే క్షణాల్లో దాని నుంచి ఉపశమనం లభిస్తుంది.బాడీ మరియు మైండ్ రిఫ్రెష్ అవుతుంది.అలాగే ఈ డ్రింక్ ను రోజు తీసుకుంటే కనుక రోగ‌ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.మరియు వెయిట్ లాస్ కూడా అవుతారు.

కాబట్టి తప్పకుండా ఈ సూపర్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube