అమెరికా అధ్యక్షుడు ట్రంప్( US President Trump ) సంచలన వ్యాఖ్యలు చేశారు.స్టేట్ ఆఫ్ ది యూనియన్( State Of The Union ) ప్రసంగంలో భారత్‌ను( India ) తప్పుబడుతూ, పాకిస్థాన్‌కు( Pakistan ) జై కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
నిన్న బుధవారం జరిగిన ఈ ప్రసంగంలో ట్రంప్ 2021 కాబూల్ విమానాశ్రయం బాంబు దాడికి సూత్రధారి అయిన టెర్రరిస్టును పట్టుకోవడంలో పాకిస్థాన్ సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.అంతేకాదు, అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న భారీ సుంకాలను తప్పుబడుతూ, ఏప్రిల్ 2 నుంచి కొత్త వాణిజ్య చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
కాబూల్ ఎయిర్‌పోర్ట్ అటాక్( Kabul Airport Attack ) వెనుక ఉన్న టాప్ టెర్రరిస్టును అమెరికా బలగాలు పట్టుకున్నాయని ట్రంప్ అనౌన్స్ చేశారు.అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వస్తున్న సమయంలో జరిగిన ఈ దాడిలో 13 మంది అమెరికన్ సైనికులు, దాదాపు 170 మంది అఫ్ఘన్ పౌరులు చనిపోయారు.“ఆ దారుణానికి కారణమైన ముఖ్య టెర్రరిస్టును మేం ఇప్పుడే పట్టుకున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నా.” అని ట్రంప్ అన్నారు.“అతను అమెరికా న్యాయస్థానంలో విచారణ కోసం ఇక్కడికి వస్తున్నాడు” అని చెప్పారు.

ఈ ఆపరేషన్‌లో సహాయం చేసినందుకు పాకిస్థాన్‌కు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు ట్రంప్.“ఈ రాక్షసుడిని అరెస్టు చేయడంలో సహాయం చేసిన పాకిస్థాన్ ప్రభుత్వానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు” అని కొనియాడారు.ఈ దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇది చాలా ముఖ్యమైన సందర్భం అని అన్నారు.“నాకు వ్యక్తిగతంగా ఆ 13 కుటుంబాలు తెలుసు.వారికి అది భయంకరమైన రోజు” అని గుర్తు చేసుకున్నారు.

ఇంకా షాకింగ్ ఏంటంటే, ట్రంప్ పాకిస్థాన్ తమ ఎఫ్-16 ఫైటర్ జెట్( F-16 Fighter Jets ) విమానాల నిర్వహణ కోసం ఏకంగా 397 మిలియన్ డాలర్ల నిధులను ఆమోదించారు.అయితే, ఈ నిధులు కేవలం ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసమేనని, అది కూడా అమెరికా పర్యవేక్షణలోనే జరగాలని స్పష్టం చేశారు.అంతేకాదు, ఈ నిధులను ఇండియాపై వాడకూడదని కండిషన్ పెట్టారు.
అమెరికా వస్తువులపై భారీ సుంకాలు విధిస్తున్నందుకు ఇండియాను ట్రంప్ తప్పుబట్టారు.దీనికి రియాక్షన్‌గా, ఏప్రిల్ 2 నుండి అమెరికా కూడా రివర్స్ టారిఫ్‌లు విధిస్తుందని ప్రకటించారు.“ఇండియా ఇంకా చాలా దేశాలు అమెరికాపై భారీ సుంకాలు వసూలు చేస్తున్నాయి.ఏప్రిల్ 2 నుంచి రివర్స్ టారిఫ్‌లు స్టార్ట్ అవుతాయి” అని తేల్చి చెప్పారు.
ఒకప్పుడు 2018లో పాకిస్థాన్‌కు సహాయం నిలిపివేసిన ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.
బైడెన్ ప్రభుత్వం 2022లో పాకిస్థాన్ ఎఫ్-16 ఫ్లీట్‌కు 450 మిలియన్ డాలర్లు ఆమోదించిన నిర్ణయంతో ఇప్పుడు ట్రంప్ కూడా జత కలిశారు.దీంతో ట్రంప్ స్టాండ్ పూర్తిగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.







