టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ( dil raju )ఒకరు కాగా దిల్ రాజు నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే.దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ (Game changer)సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
బుల్లితెరపై, ఓటీటీలో సైతం సంక్రాంతికి వస్తున్నాం అదరగొట్టింది
మరోవైపు దిల్ రాజు నిర్మించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Dil Raju,Seethamma Vakitlo Sirimalle Chettu)ఈ నెల 7వ తేదీన రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా రీరిలీజ్ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ మార్చి 7వ తేదీన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.
ఇప్పటికే 10 థియేటర్లు ఫుల్ అయ్యాయని దిల్ రాజు చెప్పుకొచ్చారు.ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ హవా కొనసాగుతున్న తరుణంలో ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని చాలామంది ఫీలవుతున్నారని దిల్ రాజు వెల్లడించారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బుల్లితెరపై ఎన్నోసార్లు ప్రసారమైందని అయినప్పటికీ రీరిలీజ్ లో వెండితెర వేదికగా ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారని దిల్ రాజు పేర్కొన్నారు.మంచి కంటెంట్ ఉంటే చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని దిల్ రాజు తెలిపారు.మహేష్, వెంకటేశ్ ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

ప్రేక్షకుల రియాక్షన్స్ చూస్తుంటే సంతోషంగా ఉందని మంచి సినిమాలు చేయడానికి మనం ప్రయత్నించాలని ఇలాంటి రీ రిలీజ్ లతో స్పష్టం అవుతోందని దిల్ రాజు అన్నారు.ప్రేక్షకులు కోరుకోకుండా మనం ఎంత పెద్ద సినిమా ఇచ్చినా మార్నింగ్ షోకే గుడ్ బై చెబుతున్నారని ఆయన తెలిపారు.సోషల్ మీడియాలో ట్రోలింగ్ సైతం మరో స్థాయిలో ఉందని దిల్ రాజు కామెంట్లు చేశారు.
గేమ్ ఛేంజర్ ను ఉద్దేశించి దిల్ రాజు ఈ కామెంట్స్ చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.