ప్రస్తుత రోజుల్లో అధిక బరువుతో( Over Weight ) బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.శరీర బరువు అదుపు తప్పితే అనేక అనారోగ్య సమస్యలు ఆహ్వానించినట్లే అవుతుంది.
పైగా ఎన్నో బాడీ షేమింగ్ కామెంట్లను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది.అందుకే చాలామంది బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? వెయిట్ లాస్( Weight Loss ) కోసం డైట్ ఫాలో అవుతున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
నిజానికి కొన్ని కొన్ని స్మూతీలు( Smoothie ) వెయిట్ లాస్ కు గ్రేట్ గా తోడ్పడతాయి.
అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయేది కూడా ఒకటి.ఈ స్మూతీ తయారీ కోసం ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో హాఫ్ యాపిల్ ను( Apple ) ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.
అలాగే ఐదు నుంచి ఆరు క్యారెట్ స్లైసెస్,( Carrot Slices ) రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్,( Rolled Oats ) నాలుగు జీడిపప్పులు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు వేసుకోవాలి.ఆపై మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
తద్వారా మన టేస్టీ అండ్ హెల్తీ స్మూతీ రెడీ అవుతుంది.
ఈ క్యారెట్ ఆపిల్ బాదం స్మూతీ లో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia Seeds ) మిక్స్ చేసి ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి.ఈ స్మూతీ ఎంతో టేస్టీగా ఉంటుంది.అలాగే ఎన్నో పోషకాలను సైతం కలిగి ఉంటుంది.
బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ స్మూతీని తీసుకోవడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.ఎక్కువ గంటల పాటు కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది.
మెటబాలిజం రేటు పెరుగుతుంది.
ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.బరువు తగ్గాలని భావిస్తున్న వారికి ఈ స్మూతీ ఎంతో హెల్ప్ చేస్తుంది.పైగా డైట్ ను ఫాలో అవ్వడం వల్ల కొందరు నీరసంగా మారుతుంటారు.
ఏ పని చేయలేకపోతుంటారు.ప్రారంభ దశలో ఇలా ఉంటుంది.
అయితే ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.సక్సెస్ ఫుల్ గా మీరు మీ వెయిట్ జర్నీని ముందుకు సాగించవచ్చు.