టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే స్టోరీతో ఒకటికంటే ఎక్కువ సినిమాలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.క్యారెక్టర్లు, కాస్త స్టోరీ ఇంప్రవైజ్ చేసి సినిమాలు తీయడం మన తెలుగు దర్శకులకు అలవాటే త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుల వరకు అందరూ ఇంతకుముందు వచ్చిన సినిమాలోని కొన్ని సన్నివేశాలను లేదంటే ఏకంగా స్టోరీ లైన్ నే కాపీ కొట్టేశారు.
ఒరిజినల్ కంటే తమ సినిమాలను చక్కగా తీసుకొని హిట్స్ అందుకున్నారు.అది వారి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.
అయితే త్వరలో ఎగ్జాక్ట్ స్టోరీతో ఓ సినిమా తెరకెక్కనుంది.ఇంకొక సినిమా ఆల్రెడీ సేమ్ స్టోరీ తో వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది మరో సినిమా కూడా సేమ్ స్టోరీ తో రావాలని చూసింది కానీ ఆగిపోయింది అవేంటో చూద్దాం.
రామాయణ
బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణం, ఆది పురుష సినిమాలు ఎగ్జాక్ట్ స్టోరీతో వచ్చాయి.ఇప్పుడు రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా రామాయణ అనే సినిమా చేస్తున్నారు.ఓకే స్టోరీ తో ఎన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలి అని చాలామంది విమర్శలు చేస్తున్నారు.ఈసారైనా ఈ మూవీని మంచిగా తీసి బాలీవుడ్ వాళ్లు హిట్ కొడతారో లేదంటే అతిపెద్ద డిజాస్టర్ అందుకుంటారో చూడాలి.
రణ్‌బీర్( Ranbir Kapoor ) లాంటి రొమాంటిక్ పర్సన్ రాముడిగా నటించడమే పెద్ద జోక్ అంటూ ఇప్పటికే విమర్శలు భారీ స్థాయిలో వస్తున్నాయి.
వ్యూహం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన “యాత్ర” సినిమా సూపర్ హిట్ అని సంగతి తెలిసిందే.దీనికి సీక్వల్‌గా యాత్ర 2 కూడా వచ్చింది.ఇందులో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి( CM Jagan Mohan Reddy ) పొలిటికల్ కెరీర్, కష్టాల గురించి చూపించారు.అయితే సేమ్ ఇదే స్టోరీతో కాంట్రవర్షల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ “వ్యూహం(Vyuham Movie )” తీసి ఆశ్చర్యపరిచాడు.
టైగర్ నాగేశ్వరరావు
రవితేజ హీరోగా పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ “టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao )” తెరకెక్కి ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.అయితే సేమ్ ఇదే స్టోరీ తో బెల్లంకొండ శ్రీనివాస్ స్టువర్టుపురం దొంగ అనే సినిమా స్టార్ట్ చేశాడు.ఈ సినిమా స్టోరీ 1970లో భారీ దొంగతనాలు చేసిన టైగర్ నాగేశ్వరరావు అనే స్టువర్ట్‌పురం దొంగ చుట్టూ తిరుగుతుంది.
ఈ దొంగ బయోపిక్ తీద్దామని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా అనుకున్నాడు.ఈ మూవీ షూటింగ్ కూడా కాస్త నడిచింది కానీ ఏవో కారణాలవల్ల దీన్ని మధ్యలోనే ఆపేశారు.