ముఖం ఎంత తెల్లగా, మృదువుగా ఉన్నా సరే అక్కడక్కడ ఉండే నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు అందాన్ని మొత్తం పాడుచేస్తాయి.అందుకే మచ్చలేని ముఖ చర్మాన్ని( Face Scars ) పొందడం కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో ఆరాటపడుతుంటారు.
మార్కెట్ లో లభ్యమయ్యే క్రీమ్, సీరమ్ లను వేలకు వేలు పెట్టి కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే వాటి వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి.
కానీ, ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మీ ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు.క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక ఆరెంజ్ పండు( Orange )ను తీసుకుని సాల్ట్ వాటర్ లో శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత తొక్క తీయకుండానే ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక టమాటో ను కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ పండు ముక్కలు మరియు టమాటో ముక్కలు( Tomato ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో స్మూత్ పేస్ట్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్ లో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్( Wild Turmeric Powder ), హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని కనీసం ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని ఏదైనా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.స్కిన్ టోన్( Skin Tone ) ఇంప్రూవ్ అవుతుంది.చర్మం కాంతివంతంగా అందంగా మెరిసిపోతుంది.అలాగే మెడ నలుపును మాయం చేయడంలోనూ ఈ రెమెడీ గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.
కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మచ్చలేని మెరిసే తెల్లటి చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.