ప్రభాస్ హను రాఘవపూడి( Prabhas, Hanu Raghavapudi ) కాంబో మూవీపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ సినిమాలో ఇమాన్వి ఇస్మాయిల్( Iman Esmail ) హీరోయిన్ గా నటిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రభాస్ కొత్త హీరోయిన్ లో ఉన్న స్పెషాలిటీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
ఈ బ్యూటీ మంచి డ్యాన్సర్ అని తెలుస్తోంది.ఎలాంటి డ్యాన్స్ అయినా అద్భుతంగా చేయగల ప్రతిభ ఆమె సొంతమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
క్లాసికల్, వెస్ట్రన్ అనే తేడాల్లేకుండా ఈ బ్యూటీ డ్యాన్స్ అద్భుతంగా చేయగలరని సమాచారం అందుతోంది.పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో స్వాతంత్రానికి ముందు జరిగిన సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
క్లాసికల్ డాన్స్ ఎలిమెంట్స్ కు ఈ సినిమాలో ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. జయప్రద, మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఈ సినిమాలో ప్రతి పాట అద్భుతంగా ఉండనుందని ట్యూన్స్ విషయంలో విశాల్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని భోగట్టా.సీతారామం సినిమాకు సైతం విశాల్ చంద్రశేఖర్ ( Vishal Chandrasekhar )మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు.
ప్రభాస్ హను రాఘవపూడి కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రభాస్ హను రాఘవపూడి కాంబో మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఇమాన్వీ ఇస్మాయిల్ సాయిపల్లవి, శ్రీలీలలకు చెక్ పెట్టే బ్యూటీ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.