శ్రీలీల( Sreeleela).మొన్నటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో మారుమోగిన పేరు.
సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది శ్రీలీల.ఇకపోతే శ్రీ లీలా ప్రస్తుతం వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా హీరోలందరికీ శ్రీలీల హాట్ ఫేవరెట్ అయ్యింది.దీంతో ఆమె ఏ హీరోతో ఎలాంటి సినిమా చేస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.
ప్రస్తుతం ఒకవైపు చదువును కొనసాగిస్తూనే మరొకవైపు హీరోయిన్ గా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.అయితే ఈ యంగ్ బ్యూటీ ఓ మెగా ఆఫర్ మిస్ చేసుకున్నట్లుగా సినీ సర్కిల్స్‌లో ఒక వార్త జోరుగా వినిపిస్తోంది.అదేమిటంటే.టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీ( Megastar Chiranji )వి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండగా అందులో డ్యాన్స్ చేసేందుకు శ్రీలీలను అడిగారట మూవీ మేకర్స్.
కానీ హీరోయిన్‌గా ఎదుగుతున్న తాను ఇప్పుడే స్పెషల్ సాంగ్స్ చేస్తే తన కెరీర్ కి కలసిరాదని ఈ బ్యూటీ ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందనే టాక్.ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు శ్రీ లీల నిర్ణయాన్ని ఏకీభవిస్తుండగా మరికొందరు తప్పు పడుతున్నారు.మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన డాన్స్ చేసే అవకాశం వస్తే చాలామంది హీరోయిన్లు వదులుకోరు అలాంటిది ఈ యంగ్ హీరోయిన్ వదులుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే శ్రీలీల ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.