లిస్ట్ రెడీ అయ్యిందా ? వైసీపీ నాయకుల్లో పెరుగుతున్న టెన్షన్ 

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి గత వైసిపి( YCP ) ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రులు,  ఇతర నాయకుల అవినీతి వ్యవహారాలపైనే పూర్తిగా ఫోకస్ చేసింది.ఒక్కో నేతకు సంబంధించి అవినీతి వ్యవహారాలను బయటకు తీస్తూ,  జైలుకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

 Is The List Ready Is The Growing Tension Among The Ycp Leaders, Tdp, Chandrababu-TeluguStop.com

ఇప్పటికే చాలామంది నాయకుల అవినీతి వ్యవహారాల్లో అరెస్ట్ అయ్యి,  జైలుపాలవ్వగా ,  మరి కొంతమంది నేతలు విచారణలు ఎదుర్కొంటూ వస్తున్నారు.ఇక గత వైసిపి ప్రభుత్వం చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను మొత్తం బయటకు తీయాలని,  అవినీతికి పాల్పడిన వారందరినీ జైలుకు పంపాలనే లక్ష్యంతో టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబుతో( AP CM Chandrababu ) పాటు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) నిర్ణయించుకున్నట్లు సమాచారం .గత వైసిపి ప్రభుత్వం లో సీఎం గా జగన్ ఉన్న సమయంలో ప్రతి శాఖలో వైసీపీ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని , అప్పటి నుంచి టిడిపి విమర్శలు చేస్తూనే వచ్చింది.

Telugu Ap, Chandrababu, List Ready Ycp, Janasena, Janasenani, Kodali Nani, Pavan

ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన చాలా మంది వైసీపీ నాయకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని , అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా సొమ్ములు వెనకేసుకున్నారనే విమర్శలు వచ్చాయి.దీంతో గత వైసిపి ప్రభుత్వం లో ఏ ఏ శాఖల్లో ఎంతెంత అవినీతి జరిగింది అనే విషయం పైన ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.మైనింగ్ స్కాం , ఇసుక స్కాం , లిక్కర్ స్కాం,  భూ దందాలు( Sand Scam, Liquor Scam, Land Scams ), ఇలా చాలా విషయాల్లో అవినీతి జరిగిందని,  ప్రతి శాఖలోనూ భారీగా అవినీతి వ్యవహారాలు బయటపడడంతో వాటిని విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

ముఖ్యంగా పర్యాటక శాఖలో నియమాలకు విరుద్ధంగా అనేక జిల్లాల్లో అక్రమంగా అనేక ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.

Telugu Ap, Chandrababu, List Ready Ycp, Janasena, Janasenani, Kodali Nani, Pavan

అలాగే తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లు నరికి వేసి,  ఇతర రాష్ట్రాలకు విదేశాలకు తరలించారనే ఆరోపణల పైన విచారణ చేస్తుంది .ఏపీలో సిలికాన్ మైనింగ్ వ్యాపారంతో లూటీ చేశారని,  ముఖ్యంగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , అంబటి రాంబాబు , గుడివాడ అమర్నాథ్ , జోగి రమేష్ , కొడాలి నాని , పేర్ని నాని,  ఆర్కే రోజా , అనిల్ కుమార్ యాదవ్ , బొత్స సత్యనారాయణ తదితరులు నిర్వహించిన శాఖల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి , ఆయా శాఖల్లో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలను బయటపెట్టి బాధ్యులందరినీ జైలుకు పంపించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube