సాధారణంగా చాలా మంది తెల్లగా కాంతివంతంగా మరియు అందంగా( Glowing Skin ) కనిపించేందుకు మేకప్ పై ఆధారపడుతుంటారు.కానీ రెగ్యులర్ గా మేకప్ ఉత్పత్తులను వాడడం చర్మ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
అందుకే ఇకపై మేకప్ కు నో చెప్పండి.సహజంగానే చర్మాన్ని వైట్ గా బ్రైట్ గా మెరిపించుకునేందుకు ప్రయత్నించండి.
ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ అందుకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.ఈ రెమెడీ సహజ అందాన్ని ప్రోత్సహించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టమాటో స్లైసెస్,( Tomato Slices ) రెండు పొటాటో స్లైసెస్,( Potato Slices ) రెండు బీట్ రూట్ స్లైసెస్ మరియు రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసుకొని చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ బీట్ రూట్, టమాటో మరియు పొటాటో పేస్ట్ లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి, హాఫ్ టీ స్పూన్ పెరుగు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండుసార్లు ఈ రెమెడీని ప్రయత్నించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.ముఖ్యంగా ఈ రెమెడీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.టాన్ ను రిమూవ్ చేస్తుంది.
చర్మాన్ని బిగుతుగా, కాంతివంతంగా మారుస్తుంది.అలాగే ఈ రెమెడీ స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.
స్కిన్ వైట్ గా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.మేకప్ తో అవసరం లేకుండా సహజంగానే తెల్లగా కాంతివంతంగా కనిపించాలి అనుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.