త్వరలోనే దీపావళి పండుగ( Diwali Festival ) రాబోతోంది.దీపావళి అంటే చెడుపై మంచి గెలిచిన రోజు అని అంటుంటారు.
అలాగే టపాసులు పండుగ అని పిలుస్తారు.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా హుషారుగా జరుపుకునే పండుగల్లో దీపావళి ముందు వరుసలో ఉంటుంది.
అయితే ఆరోజు దీపాల మధ్య తాము కూడా అందంగా మెరిసిపోవాలని మగువలు తెగ ఆరాటపడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని మీరు కచ్చితంగా పాటించాల్సిందే.
ఈ రెమెడీ మీ అందాన్ని( Beauty ) రెట్టింపు చేస్తుంది.
కాంతివంతంగా మెరిపిస్తుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి( Multhani Mitti ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్ లా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను( Moisturizer ) అప్లై చేసుకోవాలి.ఇప్పటి నుంచి రోజుకు ఒకసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే దీపావళి నాటికి మీ స్కిన్ లో చాలా మార్పులు మీరు గమనిస్తారు.
ఈ రెమెడీ మీ చర్మాన్ని వైట్ గా, బ్రైట్ గా మారుస్తుంది.మొటిమలను నివారిస్తుంది.అలాగే ఈ రెమెడీని పాటిస్తే డ్రై స్కిన్( Dry Skin ) సమస్య ఉండదు.
చర్మం తేమగా, కోమలంగా మారుతుంది.షైనీ గా మెరుస్తుంది.
ఈ దీపావళి పండగకు దీపాల మధ్య మీరు కూడా అందంగా ప్రకాశవంతంగా మెరిసిపోవాలని అనుకుంటే తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.