ఇండియన్ ఫుడ్( Indian Food ) సూపర్ టేస్టీగా ఉంటూ అందరినీ ఆకర్షిస్తుంది.ప్రపంచవ్యాప్తంగా మన భారతీయ వంటకాలు ఫేమస్ అయ్యాయి.
వాటిలో రాజ్మా-చావల్( Rajma Chawal ) ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.రెడ్ కిడ్నీ బీన్స్, అన్నం కలయికగా ఉన్న ఈ క్లాసిక్ కంఫర్ట్ ఫుడ్, ఒక మీల్ కంటే ఎక్కువ – ఇది ఒక ఎమోషన్.
ఇది ఒక చిన్న కునుకు తీసిన తర్వాత కూడా మూడ్‌ను తక్షణమే మెరుగుపరుస్తుంది.
తాజాగా, ఆస్ట్రేలియన్ చెఫ్ సారా టాడ్( Australian Chef Sarah Todd ) జమ్మూను సందర్శించి, మొదటిసారిగా “పట్టే వాలే రాజ్మా చావల్”ను( Patte Wale Rajma Chawal ) తిన్నారు.
ఈ ప్రత్యేక వంటకానికి ఆమె అదిరిపోయే రియాక్షన్ ఇచ్చింది.ఆ క్షణం ఇప్పుడు వైరల్ అయింది.సారా తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్ (@sarahtodd)లో ఒక వీడియోను పంచుకుంది, ఇందులో స్ట్రీట్ వెండర్ ఈ రుచికరమైన వంటకాన్ని తయారు చేయడం కనిపించింది.రాజ్మా చావల్‌ను రుచి చూసిన సారా ఆశ్చర్యపోయింది.
“ఇది ప్రత్యేకమైనది, చాలా రుచికరమైనది” అని ఆమె చెప్పింది, “ఈ dish ట్విస్ట్ నాకు చాలా ఇష్టం.కట్టా మసాలా రుచి అద్భుతంగా ఉంది, టెక్చర్ సరైనది” అని ఆమె చెప్పింది.
తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, సారా టాడ్ ఈ వంటకం గురించి మరింత వివరాలను పంచుకున్నారు.జమ్మూ పట్టే వాలే రాజ్మా చావల్ రుచుల కలయిక అని, దానిపై క్రీమీ పనీర్, కట్టా మసాలాతో గార్నిష్ చేశారని తెలిపింది.జమ్మూలో ఉపయోగించే రాజ్మా బీన్స్ చిన్నవిగా ఉంటాయి, ప్రాంతపు సారవంతమైన లోయల కారణంగా వేరే రుచిని కలిగి ఉంటాయని ఆమె వివరించారు.ఆహారాన్ని తయారు చేసిన స్ట్రీట్ వెండర్ రమేష్‌ను కూడా ఆమె ప్రశంసించారు.
ప్రతి కస్టమర్‌ను చిరునవ్వుతో స్వాగతం చేస్తూ, ప్రతి ప్లేట్‌ను ఉత్సాహంతో అందిస్తుంటారట.
సారా వీడియోను పోస్ట్ చేసినప్పటి నుంచి దీనికి 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.చాలా మంది కామెంట్‌లలో జమ్ము రాజ్మా చావల్‌పై తమ ప్రేమను పంచుకున్నారు.“నేను జమ్మును చాలా మిస్ అవుతున్నాను” అని ఒక యూజర్ రాశారు.
మరొకరు, “అదే జమ్ము అందం” అన్నారు.మరికొందరు తమ కోరికలను వ్యక్తం చేస్తూ, “రాజ్మా చావల్ జమ్ము ప్రజల మొదటి ప్రేమ” అని ఒకరు చెప్పగా, మరొకరు “జమ్ము రాజ్మా స్వర్గంలా ఉంటుంది” అని జోడించారు.