టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలలో నటి కస్తూరికి( Actress Kasthuri ) మంచి గుర్తింపు ఉంది.ఆమె నటించిన సీరియళ్లు సైతం కస్తూరికి మంచి పేరును తెచ్చిపెట్టాయి.
కెరీర్ పరంగా బిజీగా ఉన్న తరుణంలో తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.అయితే ఈ వివాదం విషయంలో కస్తూరికి భారీ షాకులు తగులుతున్నాయి.
ప్రస్తుతం కస్తూరి పరారీలో ఉన్నారనే సంగతి తెలిసిందే.
కస్తూరిని అరెస్ట్ చేయడం కోసం పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా ముందస్తు బెయిల్ కోసం కస్తూరి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
అయితే మద్రాస్ హైకోర్టు( Madras High Court ) కస్తూరికి భారీ షాకివ్వడం గమనార్హం.సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ పిటిషన్ ను కొట్టేయడం హాట్ టాపిక్ అవుతోంది.
తన కామెంట్ల విషయంలో కస్తూరి ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.
నాకు తెలుగు గడ్డ మెట్టినిల్లు అని ఆమె కామెంట్లు చేశారు.తెలుగు ప్రజలను( Telugu People ) కించపరిచేలా తాను ఎప్పుడూ మాట్లాడలేదని కస్తూరి చెప్పుకొచ్చారు.డీఎంకే పార్టీ నేతలు తన కామెంట్లను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
అయినప్పటికీ కస్తూరి కామెంట్లపై తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో కేసులు నమోదు కావడం కొసమెరుపు.
ఈ వివాదం వల్ల కస్తూరికి ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.ఇష్టానుసారం మాట్లాడితే కెరీర్ నాశనం అవుతుందని కస్తూరి కామెంట్లతో మరోసారి ప్రూవ్ అయింది.ప్రస్తుతం కస్తూరి ఫోన్ స్విఛాఫ్ లో ఉందని సమాచారం అందుతోంది.
కస్తూరి రాబోయే రోజుల్లో అయినా ఇలాంటి విమర్శలు రాకుండా జాగ్రత్త పడతారేమో చూడాల్సి ఉంది.కస్తూరి ఈ వివాదాల నుంచి బయటపడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
కస్తూరి రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందనే సమాచారం అందుతోంది.ప్రముఖ నటి కస్తూరి ఈ వివాదం నుంచి బయటపడటానికి పలువురు లాయర్లను సంప్రదిస్తున్నారని సమాచారం అందుతోంది.