క‌రోనా నుంచి కోలుకున్నారా..అయితే ఈ ఫుడ్ తినాల్సిందే!

ప్ర‌స్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ క‌ల్లోలం సృష్టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.ఈ క్ర‌మంలోనే క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీ సంఖ్య‌లో న‌మోదు అవుతున్నాయి.

 Food Tips For Who People Recovered From Corona! Food Tips, Corona Recovered Peop-TeluguStop.com

ఇక రోజు రోజుకు పెరుగుతున్న క‌రోనా ముప్పును త‌గ్గించేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతోంది.అయిన‌ప్ప‌టికీ ఈ మ‌హ‌మ్మారి వేగం ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.

అందుకే క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.ఒక‌వేళ పొర‌పాటున‌ క‌రోనా సోకితే.

దా‌ని నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఆహార నియ‌మాలు పాటిస్తూ అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

అయితే క‌రోనా రాక‌ముందు, వ‌చ్చాక మాత్ర‌మే కాదు.

క‌రోనా త‌గ్గిన త‌ర్వాత కూడా ఆరోగ్యం విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.

అలాంటి ఆహారాల్లో రాగి దోస ఒక‌టి.సాధార‌ణంగా క‌రోనా సోక‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ చురుకు ద‌నం త‌గ్గిపోతుంది.

దాంతో అజీర్తి, గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.అయితే రాగి దోస తీసుకుంటే.

అందులో ఉండే పోష‌కాలు జీర్ణ వ్యవస్థ ప‌ని తీరును మెరుగు ప‌రుస్తాయి.

అలాగే క‌రోనా త‌గ్గిన త‌ర్వాత కూడా అల‌స‌ట‌, ఒత్తిడి, చికాకు, తెలియ‌ని ఆందోళ‌న‌ వంటి స‌మ‌స్య‌లు క‌నిపిస్తాయి.

వీటిని అదిగ‌మించ‌డంలో బెల్లం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.కాబ‌ట్టి, బెల్లం క‌లిపిన పాలు, భోజ‌నం త‌ర్వాత చిన్న బెల్లం ముక్క తిన‌డం చేస్తుండాలి.

బెల్లం తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త హీన‌త స‌మ‌స్య కూడా దూరం అవుతుంది.

క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత నీర‌సం అధికంగా ఉంటుంది.ఈ నీర‌సాన్ని నివారించాలంటే శ‌రీరానికి స‌రిప‌డా ప్రోటీన్ అందించాలి.అందుకోసం, బాదం ప‌ప్పు, వాల్ న‌ట్స్‌, ఎండు ద్రాక్ష‌, ఖ‌ర్జూరాలు, గుడ్లు, చేప‌లు వంటివి తీసుకోవాలి.

మ‌రియు ప్ర‌తి రోజు ఒక స్పూన్ నెయ్యిని ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.ఇక ప‌ప్పు ధాన్యాలు, కాయ‌కూర‌లతో త‌యారు చేసిన కిచిడి డైలీ డైట్‌లో ఉండేలా చూసుకుంటే.

శ‌రీరం పూర్తిగా కోలుకోవ‌డానికి త‌గిన పోష‌కాలు ల‌భిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube