అల్లు అర్జున్ ( Allu Arjun ) అన్ స్టాపబుల్ సీజన్ 4 ( Un Stoppable 4 ) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ( Balakrishna ) ఈయనని ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తూ ఆసక్తికరమైన సమాధానాలను రాబట్టారు.
ఈ క్రమంలోనే బాలకృష్ణ అల్లు అర్జున్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను చూపించారు.అందులో అల్లు అర్జున్ ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్లి మందు కొంటున్నటువంటి ఫోటో బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు.
అసలు అక్కడున్నది అల్లు అర్జునేనా అంటూ మరికొందరు సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ ఫోటో చూసిన అల్లు అర్జున్ ఈ ఫోటో గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఆ ఫోటోలో ఉన్నది నేనేనని నేనే మందు కొనడానికి స్వయంగా వైన్ షాప్ కి వెళ్ళానని బన్నీ తెలిపారు.ఒక స్పెషల్ పర్సన్ కోసం స్వయంగానే నేను మందు కొన్నాను అంటూ ఈయన వెల్లడించారు.
ఈ ఫోటో 2017వ సంవత్సరంలోనిదని బన్నీ తెలిపారు.ఓసారి తన స్నేహితులతో కలిసి గోవా వెళ్ళినప్పుడు తన స్నేహితుడికి మందు కొనడానికి ఇలా నేనే వెళ్లానని తెలియజేశారు.

అందరం కలిసి గోవా వెళ్ళినప్పుడు వాడు నేనొక హీరో నన్నే విషయం మరిచిపోయి వెళ్లి మందు తీసుకురమ్మని చెప్పారు.ఇక నేను కూడా ఒక హీరో అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి తన స్నేహితుడి కోసమే మందు కొనడానికి వెళ్తున్నానని భావించే వెళ్లి మందు కొనుగోలు చేశానని తెలిపారు.ఇక నేను వెళ్లి మందు కొనుగోలు చేయడంలో ఏ మాత్రం తప్పు లేదనిపించింది అంటూ కూడా బన్నీ తెలిపినట్లు తెలుస్తోంది.ఇలా తన స్నేహితుడు సందీప్ అనే వ్యక్తి కోసం ఒక స్టార్ హీరో అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఈయన స్వయంగా మందు కొనుగోలు చేశారని విషయం తెలిసిన అభిమానులు ఈయన సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.
స్నేహితుడు సహాయము అడిగితే ఏం చేయడానికి అయినా నేను సిద్ధమేనని ఎంత దూరమైనా వెళ్తానని ఇటీవల అల్లు అర్జున్ చెప్పిన మాటలు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.