గత కొద్ది రోజులుగా అల్లు ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీ(Allu family, mega family) మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు గొడవలు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.ఏపీ ఎన్నికల ముందు నుంచే ఈ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
దానికి తోడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి ఆపోజిట్ గా అల్లు అర్జున్(Allu arjun) ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది.ఇక అప్పటినుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు అల్లు అర్జున్ పై కాస్త గుర్రుగా ఉన్నారు.

సాయి ధరమ్ (Sai Dharam)అయితే ఏకంగా సోషల్ మీడియాలో అన్ ఫాలో కొట్టాడంటూ, మెగా అల్లు ఫ్యామిలీస్ విడిపోయాయని చాలామంది అనుకుంటున్నారు.ఈ ఎన్నికలనే కాదు గతంలోనూ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగో హార్ట్ చేసారు.ఇక ప్రస్తుతం ఈ ఎన్నికల సమయం నుంచి నడుస్తున్న పోరుపై తాజాగా అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చేసారు.అది కూడా నందమూరి బాలయ్య సాక్షిగా.తాజాగా ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోలో ఈ వారం గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ గురించి ఏం చెబుతారు అని అడగగా బన్నీ వెంటనే ఆయన ధైర్యం సార్.

నేను చాలామందిని చూసాను, కానీ నేను దగ్గరగా చూసిన వ్యక్తుల్లో కళ్యాణ్ గారి ధైర్యం అంటే ఇష్టం అంటూ చెప్పారు.అయితే అల్లు అర్జున్ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో.ఒరేయ్ వాళ్ళు వాళ్ళు ఒకటేరా, మీరే ఏమి తెలియని అమాయకులు వాళ్ళు విడిపోయారంటూ తెగ మట్లాడేస్తారు.
ఇప్పుడైనా రియలైజ్ అవ్వండిరా అంటూ కొంతమంది మెగా,అల్లు ఫ్యాన్స్ కు ఉచిత సలహాలిస్తున్నారు.అంతేకాకుండా ఇప్పటికైనా అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేస్తున్న వారు తెలుసుకోండి అంటూ కొందరిని ట్యాగ్ చేస్తూ మాట్లాడుతున్నారు.







