సూర్య( Surya ) హీరోగా సిరుత్తై శివ డైరెక్షన్ లో తెరకెక్కిన కంగువా మూవీ( Kangua Movie ) ఒకింత భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు.ప్రేక్షకుల అంచనాలను అందుకునే విషయంలో ఈ సినిమా ఫెయిలైందనే సంగతి తెలిసిందే.
అయితే కంగువా మూవీ కోసం సూర్య రెండేళ్ల సమయం కేటాయించడంతో పాటు ఈ సినిమా కొరకు చాలా కష్టపడ్డారు.
అయితే బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకునే విషయంలో ఈ సినిమా నిరాశ పరిచింది.
ఈ సినిమాకు సూర్య పారితోషికం కేవలం 39 కోట్ల రూపాయలు( 39 crore rupees ) కావడం గమనార్హం.గతంలో 50 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్న సూర్య ఈ సినిమాకు మాత్రం పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
కంగువా కోసం సూర్య చేసిన త్యాగాలు అన్నీ వృథా కాగా ఈ సినిమా రిజల్ట్ విషయంలో తప్పంతా దర్శకుడిదేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కంగువా హిట్ గా నిలిచి ఉంటే పాన్ ఇండియా స్థాయిలో సూర్య పేరు మారుమ్రోగి ఉండేది.సూర్య హిందీ మార్కెట్ సైతం ఊహించని స్థాయిలో పెరిగేది.సూర్య బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తారని భావించగా అందుకు భిన్నంగా జరిగింది.
కంగువ రిజల్ట్ నేపథ్యంలో కంగువ సీక్వెల్ తెరకెక్కే ఛాన్స్ కూడా లేనట్టేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

కంగువా సినిమా కథ, కథనం కొత్తగానే ఉన్నా స్క్రీన్ ప్లేతో మాయ చేసే విషయంలో దర్శకుడు శివ ఫెయిల్ అయ్యారు.ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసి హిట్ అందుకున్న సూర్య తర్వాత సినిమాలతో ఆ రేంజ్ లో మ్యాజిక్ చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పవచ్చు.సూర్య కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.







