వరుణ్ తేజ్, సూర్యలకు భారీ షాకులు.. కథల ఎంపికలో తప్పులు చేస్తే ఫ్లాప్ తప్పదా?

ఇటీవలే మట్కా,కంగువ (Matka, kanguva)సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.తాజాగా నవంబర్ 14న ఈ సినిమాలు విడుదల అయ్యాయి.

 Matka And Kanguva Disappointed At Box Office, Matka, Kanguva, Box Office, Tollyw-TeluguStop.com

ఇందులో కంగువ సినిమాకు మంచి హిట్ టాక్ వచ్చింది.ఇక మట్కా సినిమా పరవాలేదు అనిపించుకుంది.

అయితే ఈ రెండు సినిమాలకు వచ్చిన టాక్ చూస్తే ఏమంత గొప్పగా లేదు అని చెప్పాలి.ఈ రెండు సినిమాల కోసం ఆయా హీరోలు బాగానే కష్టపడ్డారు.

వ‌రుణ్ తేజ్(Varun Tej) ఇదివ‌ర‌కెప్పుడూ లేనంత యాక్టీవ్ గా మ‌ట్కా(Matka) సినిమా కోసం ప్ర‌మోష‌న్లు కూడా చేసాడు.ఏపీ, తెలంగాణ మొత్తం తిరిగాడు.

Telugu Box, Kanguva, Matka, Surya Kanguva, Surya Kangauva, Tollywood, Varun Tej

ప్రీ రిలీజ్(Pre release) లో ఎగ్ర‌సీవ్ గా మాట్లాడాడు.తెర‌పై అంత‌కు వందింత‌లు క‌ష్టం.త‌న మేకొవ‌ర్ అదిరిపోయింది.బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివ‌రీలో మార్పు క‌నిపించింది.న‌టుడిగా ఎదిగాడు.పాత్ర‌ని అర్థం చేసుకొని, అందులో ఇమిడిపోయాడు.

అయితే సినిమాకు రిజ‌ల్ట్ బాగున్న‌ప్పుడే ఈ క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ద‌క్కిన‌ట్టు.మ‌ట్కాకు వ‌చ్చిన రిపోర్ట్ ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేదు.

వ‌రుణ్ (Varun)న‌ట‌న‌కు ప‌డుతున్న మార్కులు చూసి మురిసిపోవాలి.ఇక కంగువ(Kanguva) విషయానికి వస్తే.

సినిమా విడుదలకు ముందు ఈ సినిమాపై హైప్ ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే.త‌మిళ నాట వెయ్యి కోట్లు కొల్ల‌గొట్ట‌గ‌లిగే సినిమా ఇదదే అని అన్నారు.

తెలుగులో కూడా మామూలు స్పంద‌న రాలేదు.ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కూడా భారీగా చేశారు.

Telugu Box, Kanguva, Matka, Surya Kanguva, Surya Kangauva, Tollywood, Varun Tej

తెర‌పై సూర్య (Surya)ఎప్ప‌టిలానే క‌ష్ట‌ప‌డ్డాడు.నెల రోజుల ముందు నుంచీ ఈ సినిమాకు గ‌ట్టిగా ప్ర‌మోట్ చేస్తున్నాడు.వ‌న్ మాన్ ఆర్మీలా మారి, తానొక్క‌డే ప్ర‌మోష‌న్ బాధ్య‌త త‌న భుజాల‌పై వేసుకొని ప్ర‌పంచ‌మంతా తిరిగాడు.కానీ తలా తోకా లేని క‌థ‌, అర్థం కాని క్యారెక్ట‌రైజేష‌న్లు, లౌడ్ న‌ట‌న‌ వీటి మ‌ధ్య కంగువా న‌లిగిపోయింది.

ఏం న‌మ్మి, ఇన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో, ఏది చూసుకొని సూర్య ఇంత క‌ష్ట‌ప‌డ్డాడో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.పార్ట్ 2 అంటున్నారు కానీ, దానిపై ఆశ వ‌దులుకోవ‌డం మంచిద‌న్న‌ది త‌మిళ వర్గాల టాక్.

Telugu Box, Kanguva, Matka, Surya Kanguva, Surya Kangauva, Tollywood, Varun Tej

విడుదలకు ముందు ఉన్న టాక్ విడుదల అయిన తర్వాత లేకపోవడం ఆశ్చర్య పోవాల్సిన విషయం.ఈ సూర్య సినిమా మాత్రం అభిమానులను భారీగా నిరాశపరిచిందని చెప్పాలి.ఏది ఏమైనా అటు సూర్య‌, ఇటు వ‌రుణ్ ఇద్ద‌రూ ఈ వారం ఫ‌లితాల‌తో భంగ‌ప‌డ్డారు.వాళ్ల క‌ష్టం వృథా అయ్యింది.క‌థని ఎంచుకొనేట‌ప్పుడే ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించుకొని ఉంటే, ఈ భంగ‌పాటు త‌ప్పేదేమో అని మాట్లాడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube