1.భారత లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 913 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.రేపు ఢిల్లీకి జగన్
ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు.
3.పార్లమెంట్ లో టిఆర్ఎస్ ఆందోళనలు
కేంద్రం టీఆర్ఎస్ మధ్య ధాన్యం వ్యవహారం పై పార్లమెంటులో టిఆర్ఎస్ ఆందోళన నిర్వహించింది ఈ సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పై ప్రివిలేజ్ మోషన్ ను టీఆర్ఎస్ ఎంపీలు ఇచ్చారు.సభను తప్పుదోవ పట్టించారు అంటూ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇచ్చారు.
4.7న ఏపీ మంత్రివర్గ సమావేశం
ఈనెల 7వ తేదీన ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో మంత్రి వర్గ సమావేశం ను నిర్వహిస్తున్నారు.
5.రాహుల్ గాంధీ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ
కాంగ్రెస్ రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ రోజు భేటీ కాబోతున్నారు.
6.బంగారు తెలంగాణ కాదు బాధల తెలంగాణ
టిఆర్ఎస్ పై వైయస్ షర్మిల విమర్శలు చేశారు.బంగారు తెలంగాణ కాదని బాధల తెలంగాణ అంటూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
7. విద్యుత్ ఛార్జీల పెంపుపై రామ్మోహన్ నాయుడు విమర్శలు
ఏపీలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచబోమని 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజలను దోచుకు తింటోంది అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు.
8.జిల్లాల విబజన పై పవన్ కామెంట్స్
ఏపీలో జిల్లాల విభజన సరిగా లేదని, లోపభూయిష్టంగా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.
9.విశాఖలో టీడీపీ ఆందోళన
మధురవాడ లో బినామీ పేర్లతో కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వ పెద్దలు అన్యాక్రాంతం చేశారని విశాఖ లో టిడిపి నేతలు ఆందోళన నిర్వహించారు.
10.కొత్త జిల్లాల ను ప్రారంభించిన జగన్
ఈరోజు ఉదయం 9.05 -9.45 నిమిషాలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా 26 జిల్లాలను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.
11.నేడు కోనసీమ జిల్లావ్యాప్తంగా బ్లాక్ డే
అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం పెట్టకపోవడం పై జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాలు ఈ రోజు ఆందోళన నిర్వహిస్తూ బ్లాక్ డే ని పాటిస్తున్నారు.
12.ఏపీలో నేటి నుంచి ఒంటిపూట బడులు
ఏపీలో ఈరోజు నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు ఒంటిపూట బడులు ప్రారంభం అయ్యాయి.
13.నకిలీ గురించి చర్మాల విక్రయం
తెలంగాణలో ములుగు జిల్లాలో నకిలీ పులి చర్మాలను విక్రయిస్తున్న ముఠాను వరంగల్ ట్రాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
14.త్రివిక్రమ్ శ్రీనివాస్ కు జరిమానా
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కార్ కు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.కారుకి బ్లాక్ ఫిలిం వాడుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.
15.ముంబై బార్క్ లో పోస్టుల భర్తీ
ముంబై ప్రధాన కార్యాలయం గా ఉన్న బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ( బార్క్ ) లో పోస్టుల భర్తీని చేపట్టనున్నారు.ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
16.చంద్రబాబుపై లక్ష్మీపార్వతి విమర్శలు
ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా చంద్రబాబు, టిడిపి ఒక్క పని చేయలేదని , కానీ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ అది చేసి చూపించారని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు.
17.వివాహం చేసుకోబోతున్న రణబీర్ కపూర్ , అలియా భట్
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ అలియ భట్ వివాహ బంధం తో ఒక్కటి కాబోతున్నారు.ఏప్రిల్ మూడో వారం లో వీరి వివాహం జరగనుంది.
18.స్వాతంత్ర పోరాటం పై ఢిల్లీ లో ఎగ్జిబిషన్
స్వాతంత్ర పోరాటం ఘటన పై ఢిల్లీ లో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది.
19.తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణలో ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం అధికారులు తెలిపారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,800 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,140
.