ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతున్న గ్లామర్ బ్యూటీ సమంత.తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందంతో మాత్రం కుర్రాళ్ల మతి పోగొట్టింది.
అతి తక్కువ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా ను సంపాదించుకుంది.ఇక అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.
కానీ అతి త్వరగా తన జీవితాన్ని విడాకులతో ముక్కలు చేసుకుంది.
ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది సమంత.
ఏకంగా మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.చాలా వరకు స్టార్ హీరోల సరసన నటించింది.

ఇక తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత సమంత అవకాశాలతో గాల్లోకి ఎగిరిందని చెప్పవచ్చు.ఎందుకంటే పెళ్లి తర్వాత సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది.వెండితెరపైనే కాకుండా ఓటీటీ లో ఆహా లో సామ్ జామ్ అనే షోకు కూడా హోస్టింగ్ చేసింది.
సొంతంగా వ్యాపారాలు కూడా ప్రారంభించింది.పలు బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నిలిచింది.
అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత. దీంతో ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది.
చాలా వరకు సమంత పైనే విమర్శలు చేశారు.ఇక మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో బిజీగా మారారు.
విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది సమంత.తనకు అక్కినేని ఫ్యామిలీ తో సంబంధం కట్ కావటంతో తన క్లీవేజ్ షో లకు అడ్డు చెప్పేవాళ్లే లేరని చెప్పాలి.

పొట్టి బట్టలతో గ్లామర్ లుక్ లతో అందర్నీ తన వైపు మలుపుకుంటుంది.పైగా అవకాశాలు కూడా బాగా అందుకుంటుంది.అటు టాలీవుడ్, కోలివుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ దృష్టి పడిపోయింది.దీంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రం సమంత కోసం బాగా ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు.
అలా తాజాగా సమంతకు బాలీవుడ్ లో అవకాశం రాగా.పారితోషికం విషయంలో కూడా డిమాండ్ చేసింది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన సమంతకు అవకాశం రాగా.ఈ సినిమా కోసం డైరెక్టర్ ఆమెతో సంప్రదింపులు కూడా చేశాడని తెలిసింది.ఇక అందులో ఆమె పారితోషికం విషయంలో ఏకంగా 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేసిందని తెలిసింది.అయినా కూడా ఆ సినీ దర్శక నిర్మాతలు ఆమె డిమాండ్ ను ఒప్పుకున్నట్లు తెలిసింది.







