నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసిన జగమెరిగిన సత్యం మోషన్ పోస్టర్ !!!

అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 జగమెరిగిన సత్యం చిత్ర టైటిల్, మోషన్ పోస్టర్ ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.అచ్చ విజయ భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహిస్తున్నారు.

 Producer Raj Kandukuri Launched Jagamerigina Satyam Motion Poster , Avinash Ver-TeluguStop.com

అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే.

ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు.మేలో సినిమాను థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.జగమెరిగిన సత్యం టైటిల్ బాగుంది.మోషన్ పోస్టర్ గ్రాండ్ గా ఉంది.మంచి కథ కథనాలతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అన్నారు.

నటీనటులు: అవినాష్ వర్మ, ఆద్య రెడ్డి, నీలిమ పతకమ శెట్టి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube