ఈ మధ్యకాలంలో మనిషి జీవితానికి చాలా డబ్బు అవసరం పడుతుంది.మనిషి జీవితంలో డబ్బు అనేది ఒక కీలక పాత్రలా అయిపోయింది.
మనిషి పుట్టినప్పటినుంచి చనిపోయేంతవరకు ప్రతి విషయంలోనూ అలాగే ప్రతి అంశంలోనూ సొమ్ము అవసరం కచ్చితంగా ఉంటుంది.అందుకే మనిషి తన జీవితంలో ఎక్కువ శాతం డబ్బు సంపాదించడానికి ప్రాకులాడుతూ ఉంటాడు.
అయితే ఎంత కష్టపడినప్పటికీ కూడా కొన్నిసార్లు ధనం అవసరాలు తీరవు.ఇక ధనం ఎంత ఉన్నా వృధాగా ఖర్చు కావడం లాంటివి జరుగుతుంటాయి.
దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆ తర్వాత అప్పుల బారిన పడిపోతారు.అయితే దీనికి ఇంటి వాస్తు కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు.వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయాన్నే లేచి మీరు ఈ చిట్కాలు పాటిస్తే చాలు ధనం ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది.
లక్ష్మీదేవి కటాక్షంతో( Goddess Lakshmi ) మీ ఇంట్లో అపారమైన సంపద కూడా వస్తుంది.ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి విధానాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ముఖద్వారం ఎంత ప్రాముఖ్యంగా ఉంటే దాని ప్రకారం ఇంట్లో ధనం కూడా ఆ విధంగా పెరుగుతుంది.

అయితే ఎల్లప్పుడూ సంపద ఉండాలంటే ముఖద్వారానీకున్న ప్రధాన తలుపుకు ముదురు రంగులు( Dark colors ) మాత్రమే వేయాలి.ముదురు రంగు అంటే నలుపు రంగులు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు.ఎరుపు, ముదురు ఎరుపు ఇలాంటి రంగులను వేయాలి.
ఇలా చేస్తే ఇంట్లో సంపద పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది.ఇక ఉదయాన్నే లేచి మెయిన్ డోర్ ను లక్ష్మీదేవిని మనసులో తలుచుకుని తెరిస్తే అంతా శుభం జరుగుతుంది.
అలాగే పొరపాటున కూడా ఎవరికి డబ్బుల విషయంలో శ్యూరిటీ ఇవ్వకూడదు.

ఆ అప్పు తీరకపోతే ఆ భారం మన మీద పడుతుంది.దీంతో మనం అప్పుల్లో పడిపోవడం ఖాయం.అందుకే మధ్యవర్తిగా ఉన్నవారికి సంతకం పెట్టడం మంచిది కాదు.
అలాగే చాలామంది ఈ మధ్య ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు.అయితే పిల్లలకు ఆన్లైన్ చెల్లింపుల పట్ల అవగాహన పెంచకూడదు.
ఇలా చేస్తే అప్పుల భారం మోయాల్సి వస్తుంది.అంతే కాకుండా చిన్న పిల్లల ముందు అప్పు విషయాల గురించి చర్చించకూడదు.
అలాగే ఇంట్లో వచ్చే, పోయే డబ్బుల గురించి కూడా వారి ముందు మాట్లాడకూడదు.
DEVOTIONAL