హిందూమతంలో కొన్ని రకాల చెట్లకి, మొక్కలకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.ఇందులో తులసి, వేప, మర్రి, రావి చెట్లని ఉదాహరణలుగా కచ్చితంగా చెప్పవచ్చు.
సంప్రదాయం ప్రకారం వీటికి పూజలు కూడా చేస్తారు.ముఖ్యంగా దేవాలయాలలో రావి చెట్టుకు( Peepal Tree ) ప్రదక్షిణలు చేయడం దీపాలు వెలిగించడం చాలా మంది చూసి ఉంటారు.
ఇలా ఎందుకు చేస్తారంటే రవి చెట్టులో లక్ష్మీదేవి( Lakshmi Devi ) నివసిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఈ చెట్టుని పూజించడం వల్ల జీవితంలో ధన ప్రాప్తి, ఆనందం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

అలాగే దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.రావి చెట్టుకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు.శాస్త్రీయ కోణం కూడా ఉంది.ఇది మానవులకు అవసరమైన ప్రాణ వాయును( Oxygen ) విడుదల చేస్తుంది.హిందూ మతం ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యం బాగా లేకపోతే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుందని ప్రజలను నమ్ముతారు.ఇది శరీరంలోని పిత్తా, వాతాన్ని సమతుల్యం చేస్తుందని చెబుతున్నారు.

హిందూమతం ప్రకారం రావి చెట్టును దేవతల నివాసంగా చెబుతారు.ఇందులో శని దేవుడు కూడా ఉంటాడు.అందుకే ఈ చెట్టుకు నీరు సమర్పించే దీపం వెలిగించడం వల్ల శనీ దేవుడు( Shani Dev ) సంతోషించి అదృష్టాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు.అలాగే జాతకంలో ఉన్న శని దోషం పోవాలంటే అమావాస్య వచ్చే శనివారం రోజు రవి చెట్టుకు ఏడూ ప్రదక్షిణలు చేయాలనే నియమం ఉంది.
ఈ దీపం వెలిగించడం శుభప్రదం అని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే రావి చెట్టు మానసిక ప్రశాంతతను అందిస్తుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.బ్రహ్మ ముహూర్తంలో రావి చెట్టు ప్రదక్షిణాలు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.చెడు ఆలోచనలు మనసులోకి రావు.
అలాగే రావి చెట్టుకు ప్రతిరోజు ప్రదక్షిణ చేస్తే ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL