రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ( vijay devarakonda ) హీరోగా వచ్చిన గత చిత్రం లైగర్ తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే.ఆ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ప్రస్తుతం చేస్తున్న సినిమా ఖుషి ( kushi movie )పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఖుషి సినిమా ను దర్శకుడు శివ నిర్వాన రూపొందిస్తున్నట్లుగా ఇప్పటికే విడుదల అయిన పాటలు.ప్రోమో.
పోస్టర్స్ ను చూస్తూ ఉంటే అనిపిస్తుంది.
తప్పకుండా ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాల వారిని మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మీడియా సర్కిల్స్ వారిని కూడా మెప్పించే అవకాశాలు చాలా ఉన్నాయి.అందుకే ఖుషి సినిమా ను భారీ ఎత్తున ప్రమోట్ చేయాలని విజయ్ దేవరకొండ అభిమానులు ఆశ పడుతున్నారు.కానీ సమంత( Samantha ) ఇప్పటికే బ్రేక్ తీసుకుని సంవత్సరం వరకు రాను అంటూ తేల్చి చెప్పింది.
దాంతో ఖుషి సినిమా మీడియా సమావేశాలకు ఆమె హాజరు అయ్యేది లేదు అని తేలిపోయింది.అంతే కాకుండా ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది.
అందుకే కాస్త ముందుగానే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఆగస్టు 15 నుండి షురూ చేయాలని భావిస్తున్నారు.సినిమా కు సంబంధించిన మొదటి ప్రమోషనల్ మీడియా మీట్ ను ఆగస్టు 15 సందర్భంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట.అదే సమయంలో సినిమా కి సంబంధించిన కీలకమైన ఒక వీడియోను కూడా విడుదల చేస్తారు అంటున్నారు.
సెప్టెంబర్ 1వ తారీకున ఖుషి సినిమా విడుదల అవ్వబోతున్న నేపథ్యం లో ప్రమోషన్ కార్యక్రమాలు కేవలం రెండు వారాలు సరిపోతాయా అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.మొత్తానికి ఖుషి సినిమా కు ఉన్న బజ్ ను పెంచేందుకు మంచి ప్రమోషన్ కార్యక్రమా లు నిర్వహించడం చాలా అవసరం.