ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు( NTR centenary celebrations ) ఈ మాట గత నెల రోజులుగా మీడియాలో, పేపర్లలో, సోషల్ మీడియాలో తెగ నానిపోతుంది.వైభవంగా చంద్రబాబు దగ్గరుండి మరీ టాలీవుడ్( Tollywood ) హీరోలు అందరిని రప్పించి ఉత్సవాలు అయితే చేయించాడు కానీ అందరూ బాబుని చిన్న చూపే చూస్తున్నారు.
ఎందుకంటే ఎన్టీఆర్ పై బాబు వైస్రాయ్ హోటల్( Viceroy Hotel ) ముందు చెప్పులు వేయించి ఇప్పుడు పూలదండలతో సత్కారాలు చేస్తే మాత్రం చేసిన పాపం పోతుందా చెప్పండి.సరే ఆయన సంగతి కాస్త పక్కన పెడితే చాలా మంది తెలుగువారు తెలుగు హీరోలు మీటింగ్ లో చాలానే మాట్లాడారు.

అందరిలో కన్నా మెగా హీరో రామ్ చరణ్( Ram Charan ) చెప్పిన ఒక విషయం చాలామంది కళ్ళను ఆకర్షించింది నందమూరి తారక రామారావు మంచి తిండి ప్రియుడని ఆయనతో కలిసి చికెన్ బ్రేక్ఫాస్ట్ చేశానని రామ్ చరణ్ తన స్పీచ్ లో భాగంగా చెప్పాడు.తాను మాత్రమే కాదు చాలా మంది యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ అలా తినేవాడు ఎన్టీఆర్ ఇలా తినేవాడు, చికెన్ లేనిదే ముద్ద తినడు, మంచి తిండి పురుషుడు, లేదంటే అమాంతం కోడిని అలాగే తినేస్తాడు అంటూ చెబుతూ ఉండడం చాలా సార్లు విన్నాం.ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఏం తింటున్నాడో, ఉదయం 3 గంటలకే పుష్టిగా తినేస్తాడని, బకాసురుడిగా, కుంభకర్ణుని గుర్తు తెచ్చేలా అనేక వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు.

వీళ్ళందరూ మాటలు వింటే ఎన్టీఆర్ తిడుతున్నారో పొగుడుతున్నారో కూడా అర్థం కాదు.ఆయన ఏం తింటే ఎలా తింటే జనాలకు ఏం అవసరం చెప్పండి ఎవరి తిండి పుష్టివారిది, ఎవరి జీర్ణశక్తి వారిది ఎవరికి నచ్చినట్టు వారు తింటారు.మొదటి నుంచి ఒక రకమైన తిండిపోతు గానే చూపించే ప్రయత్నం చేశారు.
ఆయన తిన్న అరిగించుకునే జీర్ణ శక్తి ఉంది కాబట్టి తింటున్నారు.కానీ టాలీవుడ్ లో అంతకన్నా పెద్ద స్థాయిలో ఉన్న నటలకైనా లేదంటే చిన్న స్థాయిలో ఉన్న నటలకైనా 30 నిండకుండా ఎన్నో రోగాలు.
ఆయనతో పోలిస్తే ఎవ్వరూ కూడా ఎన్టీఆర్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేరు.కేవలం బాబు చేసిన నమ్మకద్రోహం వల్లే కుమిలి కుమిలి ఆయన డిప్రెషన్ లోకి వెళ్లి చనిపోయారు కానీ లేదంటే మరో పాతిక సంవత్సరాలు తెలుగు రాష్ట్రాన్ని చక్కగా పాలించేవారు.