వింటర్ లో మీ పెదాలు నల్లగా మారాయా.. అయితే ఈ రెమెడీ మీ కోసమే!

ప్రస్తుత వింట‌ర్ సీజ‌న్ లో( Winter ) కొందరి పెదాలు చాలా నల్లగా మారుతుంటాయి.మనలో కూడా ఎంతో మంది ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు.

 Wonderful Home Remedy To Get Rid Dark Lips During Winter Details! Home Remedy, D-TeluguStop.com

వాతావరణం లో వచ్చే మార్పుల కారణంగా పెదాలు పొడి బారిపోయి నల్లగా త‌యార‌వ‌డం స‌ర్వ‌సాధార‌ణం.కానీ, ఇటువంటి పెదాలు( Lips ) చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.

ఈ క్రమంలోనే పెదాల నలుపును( Dark Lips ) పోగొట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు సూపర్ ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

ఈ రెమెడీని కనుక పాటిస్తే చాలా తక్కువ సమయంలోనే పెదాల నలుపును వదిలించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది తెలుసుకుందాం ప‌దండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బ్రౌన్ షుగర్( Brown Sugar ) మరియు మూడు లవంగాలు( Cloves ) వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్నా షుగర్ మరియు లవంగాల పొడిలో రెండు టేబుల్ స్పూన్ల తేనె, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా పెదాలను క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ హోమ్ రెమెడీని రోజుకు ఒకసారి కనుక పాటిస్తే పెదాల నలుపు చాలా త్వరగా మాయం అవుతుంది.

మళ్లీ మీ పెదాలు మునుపటిలా అందంగా, కాంతివంతంగా మెరుస్తాయి.పెదాల నలుపును మాయం చేయడానికి ఈ రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.కాబట్టి వింటర్ సీజన్ లో తమ పెదాలు నల్లగా మారాయి అని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube