ఈరోజుల్లో సోషల్ మీడియా ప్రజల జీవితాన్ని శాసిస్తోంది.ఏ పని చేసినా చాలామంది వాటి గురించి సోషల్ మీడియాలో గొప్పగా చెప్పుకుంటున్నారు.
ఇక గొప్ప పని చేస్తే దాన్ని మరింత గొప్పగా ప్రచారం చేయాలనుకుంటున్నారు.ఇందుకు సెలబ్రిటీలు మినహాయింపేమీ కాదు.
వీళ్లు ఏదైనా మంచి పని చేయగానే వెంటనే ఫోటోలు, వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు.ఇతరులకు స్ఫూర్తిగా తాము ఈ వీడియోలను పెట్టామని అంటారు.
కానీ తాము చేసిన పనులకు ఎంతో కొంత పబ్లిసిటీ దక్కాలని వాళ్లు అనుకోవడం సహజం.అయితే కొంతమంది యాక్టర్లు మాత్రం కొన్ని మంచి పనులు చేసినా పబ్లిసిటీని అసలు కోరుకోవడం లేదు.
ఆ సెలబ్రిటీస్ ఎవరో, వారు చేసే మంచి పనులు ఏంటో తెలుసుకుందాం.
షకీలా
:
అడల్ట్ స్టార్ షకీలా( Shakeela ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.90ల్లో ఈ హాట్ బాంబు A రేటెడ్ సినిమాల్లో నటిస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.తరువాత జయం వంటి సినిమాల్లో మంచి పాత్రలు వేసి ఆకట్టుకుంది.
కానీ షకీలాకు పెద్దగా అవకాశాలు వచ్చేవి కావు.గత కొన్నేళ్లుగా ఆమె ఏ సినిమాలోనూ నటించిన దాఖలాలు లేవు.
ఒకానొక సమయంలో ఆమె అద్దె ఇంట్లో ఉంటూ సామాన్యురాలిగా కూడా లైఫ్ గడిపింది.తర్వాత బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ ఆర్థిక సమస్యలను అధిగమించింది.
అయితే ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆమె ఐదారుగురు ట్రాన్స్ జెండర్స్ ని అడాప్ట్ చేసుకుంది.వారి బాగోగులను చూసుకుంటూ వారి జీవితాలను రంగుల మయం చేసింది.
అయితే ఆమె వీళ్లను చేరదీసినట్లు ఏ సందర్భంలోనూ చెప్పలేదు.అంత మంచి పని చేసినా ఆమె ఎలాంటి పబ్లిసిటీని కోరుకోలేదు.
మీడియా ముందు కూడా ఈ విషయం గురించి ఆమె పెద్దగా మాట్లాడలేదు.తానే గొప్పదాన్ని అని ఆమె ఎప్పుడూ చెప్పుకోలేదు.
కొంతకాలం క్రితం ‘కుకు విత్ కోమాలి’ షోలో షకీలా తాను అడాప్ట్ చేసుకున్న ట్రాన్స్ జెండర్ మిల్లాను ప్రేక్షకులకు పరిచయం చేసింది.షకీలా పెళ్లి చేసుకోలేదు.
![Telugu Anushka Shetty, Cooku Comali, Prabhas, Shakeela, Tollywood, Transgenders- Telugu Anushka Shetty, Cooku Comali, Prabhas, Shakeela, Tollywood, Transgenders-](https://telugustop.com/wp-content/uploads/2024/07/promotions-Shakeela-Transgenders-Prabhas-Anushka-Shetty-tollywood.jpg)
ప్రభాస్
:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) గత రెండేళ్లుగా తన సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి ఆ సినిమాలో పనిచేసిన ప్రతి ఒకరి ఖాతాలో పదివేల రూపాయలు జమ చేస్తున్నాడు.తద్వారా తన గొప్ప మనసును చాటుకుంటున్నాడు.సినిమా విజయానికి ప్రతి ఒక్కరి కృషి ఉందని చెబుతున్నాడు.తానొక్కడే డబ్బులన్నీ దోచేయకుండా తనకు వచ్చిన దానిలో కొంత అందరికీ సమానంగా ఇస్తున్నాడు.
అనుష్క
:
![Telugu Anushka Shetty, Cooku Comali, Prabhas, Shakeela, Tollywood, Transgenders- Telugu Anushka Shetty, Cooku Comali, Prabhas, Shakeela, Tollywood, Transgenders-](https://telugustop.com/wp-content/uploads/2024/07/promotions-Shakeela-Transgenders-Anushka-Shetty-tollywood.jpg)
టాలీవుడ్ క్వీన్ అనుష్క బెంగళూరులోని బ్లైండ్ స్కూల్ పిల్లల కోసం పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు.ఈ విషయం గురించి చాలామందికి తెలియదు.కానీ ఆమె చాలా కాలంగా ఈ పిల్లల ప్రాథమిక అవసరాలను తన సొంత డబ్బులతో తీరుస్తున్నట్లు సమాచారం.