శంఖం ఆవిర్భావం గురించి ఓ కథ ప్రచారంలో ఉంది.పూర్వం శంఖాసురుడనే రాక్షసుడు ఉండేవాడట.
వాడు దేవతలను ఓడించి, వేదాలను అపహరించి, సముద్రం అడుగున దాక్కున్నాడట.దిక్కు తోచని దేవతలు శ్రీ హరిని సాయం చేయమని కోరారట.
అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించి, ఆ శంఖాసురుణ్ణి సంహరించాడట.అప్పుడు ఆ దేవ దేవుడు శంఖం ఆకారంలో ఉన్న ఆ రాక్షసుడి చెవినీ, శిరస్సునూ ఊదాడట.
దాని నుంచి ఓం కారం వెలువడిందట. ఆ ఓంకార నాదం నుంచి వేదాలు పుట్టాయట.
వేదాల్లో ఉన్న జ్ఞానం మొత్తం ఓం కారానికి విస్తృత రూపమే! అలా ఆ శంఖాసురుడి నుంచే శంఖం అనే పేరు వచ్చింది.
ఇక అప్పటి నుంచి ఈ శంఖానికి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది.
పురాణా గాథల్లో కూడా దీని కథను గురించి వివరించడం… ఇప్పటికీ ఈ శంఖాలను చెవి వద్ద పెట్టుకుంటే సంగీత వినిపిచండంతో… ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తున్నాం.అలాగే కొట్టి చోట్ల తీర్థాన్ని శంఖంలో పోసే భక్తులకు అందజేస్తుంటారు.
శంఖంలో పోసిన నీరు కొద్ది గంటల తర్వాత శక్తి గల నీటిగా మారుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.దీన్ని ఆయుర్వేద శాస్త్రాలు కూడా నిరూపించడంతో.
చాలా చోట్ల ఈ పద్ధతిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.అంతే కాదండోయ్ దీని వల్ల శంఖంలో పోస్తోనే తీర్థం అనే నానుడి కూడా వచ్చింది.
శంఖాల్లోనూ పలు రకాలు ఉన్నాయి.దక్షిణ భాగం తెరిచి ఉండే దక్షిణావర్థ శంఖం అని అంటారు.