ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణమాసంలో ఎన్నో పవిత్రమైన పండుగలు వస్తూ ఉంటాయి.అలాగే శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగలలో కృష్ణాష్టమి( Krishna Janmashtami ) ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.
శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారంగా జన్మించాడు.కృష్ణుడి పుట్టినరోజును జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా పిలుస్తారు.
శ్రీకృష్ణుడు జన్మించిన రోజు కావున జన్మాష్టమి అని కూడా పిలుస్తారు.శ్రీకృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు.
కాబట్టి గోకులాష్టమి( Gokulashtami ) అని కూడా పేరు వచ్చింది.

శ్రీకృష్ణాష్టమి రోజు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణునికి ఇష్టమైన నైవేద్యాలను పెట్టి పూజ చేస్తారు.శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఆహార పదార్థాలు ఏమిటంటే ఆవు పాలు, వెన్న, మిగడ అంటూ చాలామంది చెబుతూ ఉంటారు.అయితే శ్రీకృష్ణుడు గోవులకు, గోపాలకులకు రక్షణగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి రక్షించాడు.
గోవుల పట్ల ఇష్టంతోనే గోపాలుడు అయ్యాడు.వాటి మీద ప్రేమతో ఆవు పాలు, వెన్నలను ఇష్టంగా తినేవాడు.
వెన్న దొంగలించిన మిగతా గోపాలురకు పెట్టి ఆ తర్వాతే శ్రీకృష్ణుడు ఆరగించేవాడు.

వెన్న( Butter ) దొంగలించిన ఇంటిలో పాలు, వెన్న సమృద్ధిగా ఉండేలా అనుగ్రహించేవాడు.శ్రీ కృష్ణాష్టమి రోజున కృష్ణుడు రావాలని ఇంటి గుమ్మం నుంచి ఇంటిలోకి చిన్ని కృష్ణుని పాదాలు కూడా వేస్తారు.ఇంకా చెప్పాలంటే శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు.
అలాగే ఉయ్యాల కట్టి అందులో శ్రీ కృష్ణనీ విగ్రహాల్ని ఉంచి భక్తులు ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడుతూ ఉంటారు.అలాగే కృష్ణాష్టమి రోజు సాయంత్రం వీధులలో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడుతూ ఉంటారు.
అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ అని కూడా అంటారు.