వీడియో: గుండెపోటుతో మరొకరు మృతి.. కార్డియో చేస్తూ కుప్పకూలాడు..

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి గుండె సమస్యలు వస్తున్నాయి.ప్రజలకు సడన్ గా హార్ట్ అటాక్స్‌( Heart Attack ) వచ్చి వారిని బలిగొంటున్నాయి.

 Maharashtra Man Dies Of Heart Attack During Workout At Gym In Sambhajinagar Vide-TeluguStop.com

రీసెంట్ టైమ్స్‌లో డైలీ ఎక్కడో ఒక చోట ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులే గుండెపోటుకు గురై చనిపోతున్నారు.తాజాగా మహారాష్ట్రలోని( Maharashtra ) ఛత్రపతి సంభాజినగర్‌లోని ఇలాంటి మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.

ఇక్కడ ఉన్న ఓ జిమ్‌లో( Gym ) వర్కౌట్ చేస్తుండగా 54 ఏళ్ల వ్యాపారికి గుండెపోటు వచ్చింది.అంతే అతడు చూస్తుండగానే చనిపోయాడు.

ఈ దారుణ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది.జిమ్‌లోని సీసీటీవీ కెమెరాలో అతడికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ వీడియోలో 54 ఏళ్ల వ్యాపారి కన్వల్జిత్ సింగ్ బగ్గా( Kanwaljeet Singh Bagga ) జిమ్‌లో ఒక బృందంతో కలిసి వ్యాయామం చేస్తున్నాడు.కొంతసేపటి తర్వాత, అతను అస్వస్థతకు గురై, ఒక స్తంభానికి ఆనుకుని నిలబడతాడు.ఆ తర్వాత క్షణాల్లోనే నేలపై కూలిపోతాడు.

ఈ సమయంలో, అక్కడే వ్యాయామం చేస్తున్న ఇతరులు ఏమీ గమనించకుండా వ్యాయామం కొనసాగిస్తూ ఉంటారు.బగ్గా కూలిపోయినట్లు గమనించిన వెంటనే, సమీపంలో ఉన్నవారు అతని దగ్గరకు వెళ్లి పరిశీలించడం ప్రారంభిస్తారు.

బగ్గాను వెంటనే ఆసుపత్రికి తరలించారని, అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారని బగ్గా కుటుంబ సభ్యులు తెలిపారు.కన్వల్జిత్ సింగ్ బగ్గా ఫిట్‌నెస్‌కు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడు, క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్ళేవాడని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు.“రోజువారీ దినచర్యలో భాగంగా, అతను ఫిట్‌నెస్ సెంటర్‌కు వెళ్లి, వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయాడు.” అని వారు తెలిపారు.బగ్గా మరణానికి కారణం ఊహించని విధంగా వచ్చిన గుండెపోటు అని తెలుస్తోంది, అయితే మరణానికి కచ్చితమైన కారణం పోస్ట్‌మార్టమ్ తర్వాతే తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube