టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్రలో లేని విధంగా భారీ ఫ్యాన్ వార్స్..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నడూ లేని విధంగా హీరోలు, అభిమానుల మధ్య భారీ యుద్ధం నడుస్తోంది.బాలయ్య వెర్సెస్ తారక్, బన్నీ వెర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది.2024 ఎన్నికల్లో అల్లు అర్జున్( Allu Arjun ) పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తరఫున ప్రచారం చేయలేదు కానీ వైసీపీ అభ్యర్థి తరఫున స్వయంగా వెళ్లి క్యాంపెయిన్ నిర్వహించారు.ఆ తర్వాత నాగబాబు సొంతవాడైనా పగవాడే అంటూ ఇన్‌డైరెక్ట్‌గా బన్నీని టార్గెట్ చేసినట్లుగా తెలిసింది.

 Unbelievable Fans War In Tollywood Details, Mega Vs Allu Family, Nandamuri Famil-TeluguStop.com

మరోవైపు పవన్ “ఈ రోజుల్లో హీరోలు స్మగ్లర్లగా నటిస్తున్నారు, ఇండస్ట్రీకి ఇలాంటి దుస్థితి వచ్చింది” అన్నట్లు మాట్లాడారు.

ఇక మెగా ఫాన్స్ కూడా బన్నీని ఏకపారేస్తున్నారు.పుష్ప-2( Pushpa 2 ) సినిమాని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో చిన్నపాటి ఉద్యమం కూడా మొదలుపెట్టారు.నిజానికి బన్నీ జై పవన్ కళ్యాణ్, జై చిరంజీవి అని ఎక్కడా, ఎప్పుడూ నినాదాలు చేయాల్సిన అవసరం లేదు.

తనకంటూ సొంత ఫ్యాన్స్ ఉండాలని, సొంతంగా ఎదగాలని ఒక ఆశ ఉండటంలో అసలు తప్పే లేదు.టాలెంట్ ఉన్నా కూడా బన్నీ మెగా క్యాంప్ కిందే బతకాల్సిన అవసరం ఏంటి? అల్లు రామలింగయ్య చిరంజీవికి ఎంతో సపోర్ట్ చేశారు.మెగాస్టార్ కూడా బన్నీ ఫ్యామిలీకి ఎంతో చేశారు.ఇండస్ట్రీలో నిలబడ్డారంటే ఇరువురి సపోర్టు ఉందనే చెప్పుకోవాలి.

Telugu Allu Arjun, Balakrishna, Chandrababu, Chiranjeevi, Devara, Jr Ntr, Fans,

అలాంటప్పుడు ఓన్లీ మెగా ఫ్యామిలీకే మొత్తం క్రెడిట్ పోతుందంటే బన్నీ చూస్తూ ఊరుకోవాలా అనేది అభిమానులు వినిపిస్తున్న వాదన.మెగా ఫాన్స్( Mega Fans ) జై పవన్ కళ్యాణ్ అని చెప్పాలంటూ అడగడం, “నేను చెప్పను బ్రదర్” అంటూ బన్నీ అనడం నుంచే ఇదంతా స్టార్ట్ అయింది.నాగబాబు, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్‌ తేజ్, బన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే బన్నీ, మెగా ఫ్యామిలీలలో ఎవరూ కూడా తగ్గట్లేదు.తమ అహాన్ని సాటిస్ఫై చేసుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు.

దీన్ని ఫ్యాన్స్‌పైనా రుద్దుతున్నారు.ఇలా ఇది ముదురుతున్న కొద్దీ అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య బంధం రోజురోజుకూ బాగా క్షీణిస్తోంది.

Telugu Allu Arjun, Balakrishna, Chandrababu, Chiranjeevi, Devara, Jr Ntr, Fans,

టాలీవుడ్‌లో మరొక ఫ్యామిలీ అయిన నందమూరి కుటుంబంలో( Nandamuri Family ) కూడా ఇలాంటి ఇగోయిస్టిక్ ఆటిట్యూడ్ కనిపిస్తోంది.బాలకృష్ణ( Balakrishna ) మూవీ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా త్వరలోనే 50 ఇయర్స్ ఈవెంట్ నిర్వహించనున్నారు.దీనికి చాలామంది సినిమా సెలబ్రిటీలు వస్తున్నారు.మరి తారక్ వస్తాడా? అని అడిగితే పిలవాల్సిన అవసరం లేదు అని బాలయ్య అన్నాడట.వాస్తవానికి నందమూరి ఫ్యామిలీ జూ.ఎన్టీఆర్‌ని( Jr NTR ) మొదటి నుంచీ దూరం పెడుతూనే వస్తున్నారు.బాబు పొలిటికల్ బెనిఫిట్స్ కోసం వీరిని చంద్రబాబు కలిపారు.అవసరం తీరాక మళ్ళీ దూరం చేశారు.ఇలాంటి మనస్తత్వం ఉన్నవారికి దూరంగా ఉండటమే మంచిది అని తారక్‌ తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

Telugu Allu Arjun, Balakrishna, Chandrababu, Chiranjeevi, Devara, Jr Ntr, Fans,

చివరకు తమ సిస్టర్‌కు కూకట్‌పల్లి టికెట్టిచ్చినా సరే, జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్ ఏపీ ప్రచారానికి వెళ్లలేదు వెళ్లరు కూడా.తారక్‌ ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అతని దగ్గరికి రానిస్తే లోకేష్ సీఎం అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయని చంద్రబాబు రానివ్వరు.సొంత అల్లుడు లోకేష్, చంద్రబాబుకు నచ్చని తారక్‌ ఆటోమేటిక్‌గా బాలయ్యకు కూడా నచ్చరు అని కొంతమంది అభిప్రాయం.

తారక్‌ తను ఒక సొంత ప్రపంచం క్రియేట్ చేసుకోగలిగాడు.ఎవరి సహాయం లేకుండా తన కాలపై తాను నిలబడ్డాడు.

తారక్ కర్నూలులో దేవర మూవీ( Devara ) ప్రిరిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు.బాలకృష్ణను ఆయన పిలిచే అవకాశం లేదంటున్నారు.

ఇలా వైరం మెగా – నందమూరి కుటుంబ సభ్యుల మధ్య సాగుతోంది.ఈ గొడవల్లో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ప్రమేయం ఉండటమే ఆసక్తికరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube