సాధారణంగా చాలా మంది తమ జుట్టు ఒత్తుగా( Thick hair ) మరియు సిల్కీగా కనిపించాలని ఆరాటపడుతుంటారు.అందుకోసం సెలూన్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు.
కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఒత్తైన సిల్కీ జుట్టును తమ సొంతం చేసుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ రెమెడీని పాటిస్తే సహజంగానే మీ జుట్టు ఒత్తుగా మరియు సిల్కీగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ), హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాలు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మెంతులు, బియ్యం మరియు లవంగాలు వాటర్( Clove ) తో సహా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక ఫుల్ ఎగ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, రెండు చుక్కలు టి ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది.అలాగే కురులు స్మూత్ అండ్ సిల్కీగా మారతాయి.
మరియు జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలు సైతం అదుపులోకి వస్తాయి.కాబట్టి జుట్టు ఒత్తుగా సిల్కీగా మెరుస్తూ కనిపించాలంటే తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.







