ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress Party )అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది .పార్టీ నుంచి కీలక నాయకులు చాలామంది ఇప్పటికే ఇతర పార్టీలలో చేరిపోగా, మరి కొంతమంది ప్రస్తుత రాజకీయాలతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు .
ఆ జాబితాలో చేరిపోయారు మాజీమంత్రి ఆర్కే రోజా( Roja ). జగన్ కు అత్యంత సన్నిహితురాలిగా ముద్రపడిన ఆర్కే రోజా ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు .
ఎక్కడా పార్టీకి సంబంధించిన అంశాలపై స్పందించేందుకు ఆమె ఇష్టపడడం లేదు .దీంతో క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారనే ప్రచారం పార్టీలోనే మొదలైంది.రోజా ఎక్కువగా కుటుంబ సభ్యుల కోసమే సమయాన్ని కేటాయిస్తున్నారు తమిళనాడులో ఉండే ఆలయాలలో ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాగే విదేశీ టూర్లకు వెళ్లి వచ్చారు. ఇలా ఎక్కువ సమయం కుటుంబ సభ్యుల మధ్య గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయ అంశాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ప్రస్తుతం రోజా వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశం గా మారింది.దీంతో రోజా వైసిపిలో కొనసాగే అవకాశం లేదని, సరైన సమయం చూసుకొని ఆమె పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతుంది.ముఖ్యంగా నగరి నియోజకవర్గంలో పార్టీలోని తన వ్యతిరేక వర్గాన్ని మాజీ మంత్రి పుంగనూరు ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) ప్రోత్సహించడం , సొంత పార్టీలోనే తనను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తుండడం వంటి పరిణామాలపై గతంలోనే అనేకసార్లు జగన్కు ఫిర్యాదు చేశారు అయినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాకపోవడం , ఇప్పుడు వైసిపి లో యాక్టివ్ గా ఉన్నా.కూటమి ప్రభుత్వంతో అనేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాలని భావిస్తున్న రోజా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట.
ఎక్కువగా తమిళనాడు రాజకీయాల వైపు ఆసక్తి చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.ముఖ్యంగా తమిళ హీరో దళపతి విజయ్ కొత్తగా ప్రారంభించిన తమిళగ వెట్రి కజగం లో చేరే ఆలోచనతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.