జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరవాలని అందరూ కోరుకుంటారు.అందుకోసమే ఖరీదైన షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు.
అయినప్పటికీ, కొందరి జుట్టు రంగు మారిపోతుంటుంది.దాంతో ఏం చేయాలో తెలియక రంగు వేసుకుంటారు.
అయితే జుట్టును నల్లగా మెరిసేలా చేయడంలో కాఫీ పౌడర్ అద్భుతంగా సమాయపడుతుంది.మరి కేశాలకు కాఫీ పౌడర్‌ను ఎలా యూజ్ చేయాలి? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసి.అందులో ఒకటిన్నర స్పూన్ కాఫీ పౌడర్, అర స్పూన్ లవంగాల పొడి వేసి మరిగించాలి.బాగా మరిగిన తర్వాత వేరే బౌల్లోకి నీటిని వాడబోసి.తలకు, కేశాలకు అప్లై చేయాలి.
ఇరవై, ముప్పై నిమిషాల అనంతరం మామూలు షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా చేస్తే జుట్టు నల్లగా, కాంతివతంగా మారుతుంది.
అలాగే ఒక గిన్నెలో మూడు, నాలుగు స్పూన్ల కాఫీ పౌడర్ వేసుకుని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి కలుపుకోవాలి.
ఆ తర్వాత తలకు, కుదుళ్లకు మరియు జుట్టుకు ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకుంది.గంట అనంతరం గోరు వెచ్చని నీటితో హెడ్ బాత్ చేయాలి.నాలుగు రోజులకు ఒక సారి ఇలా చేస్తే.
జుట్టు నల్లగా మెరిసి పోతుంది.మరియు హెయిర్ ఫాలో సమస్య కూడా తగ్గు ముఖం పడుతుంది.
ఇక రెగ్యులర్ గా వాడే ఏదో ఒక కండీషనర్ తో కొద్ది కాఫీ పౌడర్ కలపండి.ఇప్పుడు దీనిని కుదుళ్ళ నుంచి చివర్ల వరకూ పట్టించండి.ముప్పై నిమిషాల పాటు అలా వదిలేసి.ఆ తర్వాత మైల్డ్ షాంపూ యూజ్ చేసి తల స్నానం చేసేయండి.
ఇలా వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేసినా మంచి ఫలితం ఉంటుంది.