సాధారణంగా స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి భయపడతారు.ఎందుకంటే ఆ మూవీ ఫెయిలైతే అభిమానులను తీవ్రంగా డిసప్పాయింట్ చేసినట్లు అవుతుంది.
కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోతుంది.మళ్లీ హిట్ సాధించాలనే ప్రెషర్ పెరిగిపోతుంది.
ఈ గోలంతా ఎందుకు అని ఓన్లీ సక్సెస్ఫుల్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తుంటారు కానీ కొందరు మాత్రం కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి అందరికీ మేలు చేస్తారు.ఇలాంటి హీరోలు టాలీవుడ్లో కూడా ఉన్నారు.
వారెవరో తెలుసుకుందాం.
నాగార్జున
టాలీవుడ్ కింగ్ మొదటి నుంచి ప్రయోగాత్మక సినిమాలు తీయడంలో ముందు ఉంటూ వస్తున్నారు.ఈయన కొత్త దర్శకులకు అవకాశం ఇస్తారు.మొత్తం 99 సినిమాల్లో నటించిన నాగార్జున( Nagarjuna ) ఇప్పటికే 20 మంది కొత్త దర్శకులను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
కాంట్రవర్షల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి ముందుగా నాగార్జునే అవకాశం ఇచ్చారు.వాళ్లిద్దరూ కలిసి తీసిన “శివ” సినిమా( Siva ) ఒక ట్రెండ్ సెటర్ అయింది అని చెప్పుకోవచ్చు.
నాగ్ తన కిల్లర్ సినిమాతో దర్శకుడు ఫాజిల్‌ను కూడా తెలుగులో ఇంట్రడ్యూస్ చేశారు.నిర్ణయం సినిమాతో తెలుగు తెరకు ప్రియదర్శన్‌ను తీసుకొచ్చారు.డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్‌కి కూడా తన సినిమాకి దర్శకత్వం చేసే ఛాన్స్ ఇచ్చారు.ఇలా చెప్పుకుంటూ పోతే నాగ్ ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్లను పరిచయం చేసి మూవీ ఇండస్ట్రీకి మంచి చేశారు.
రవితేజ
మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) సినిమాలు ఫ్లాప్ అవుతున్నా సరే భయపడకుండా కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తాడు.ఇప్పటిదాకా ఈ హీరో 12 మంది కొత్త డైరెక్టర్లను సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం చేశాడు.వారిలో బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, హరీష్ శంకర్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లు కూడా ఉన్నారు.
నాని
నేచురల్ స్టార్ నాని( Nani ) విభిన్నమైన సినిమాలు చేయడానికి ఇష్టపడతాడు.అంతేకాదు కొత్త వారైనా సరే టాలెంటెడ్ దర్శకులైతే వారిని బాగా నమ్ముతాడు.అందుకే ఈ హీరో చాలామంది దర్శకులను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడు.నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, శివ నిర్వాణ, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇలా మొత్తం ఎనిమిది మంది దర్శకులకు అవకాశం ఇచ్చాడు.