ఈ నటీమణులు ఎంత తక్కువ వయసులో హీరోయిన్లు అయ్యారో తెలిస్తే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు పరిచయమయ్యారు.కొందరైతే టీనేజ్ వయసులోనే హీరోయిన్లుగా మారి చాలామంది ప్రేక్షకుల హృదయాలను దోచేశారు.

 Tollywood Heroines Entry In Early Age Details, Swetha Basu Prasad, Krithi Shetty-TeluguStop.com

ఈ ముద్దుగుమ్మలు చాలా అందంగా ఉండటమే కాకుండా మంచి యాక్టింగ్ పర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేశారు.ఆ హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

• ఛార్మీ కౌర్ – 15 ఏళ్లకే హీరోయిన్:

ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.ఛార్మీ కౌర్( Charmi Kaur ) మాస్, అనుకోకుండా ఒక రోజు, లక్ష్మి, పౌర్ణమి, రాఖీ వంటి చిత్రాలలో అద్భుతంగా నటించి మెప్పించింది.

ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉండటమే కాకుండా బీభత్సమైన గ్లామర్ షో కూడా చేస్తుంది.అందుకే ఈ తారకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.ఈ ముద్దుగుమ్మ దాదాపు 22 ఏళ్ల క్రితమే ‘నీ తోడు కావాలి’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ స్క్రీన్‌కి పరిచయమయ్యింది.ఈ సినిమా రిలీజ్ అయ్యే నాటికి ఛార్మీకి కేవలం 15 ఏళ్లు మాత్రమే ఉన్నాయి.

అంత తక్కువ వయసులో ఈమె తప్ప మరెవరూ హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం కాలేదని చెప్పుకోవచ్చు.

Telugu Avika Gor, Charmi Kaur, Age, Hansika, Cine, Krithi Shetty, Tamanna, Tolly

• తమన్నా – పదహారేళ్లకే హీరోయిన్

మిల్కీ బ్యూటీ తమన్నా( Tamanna ) తన స్వీట్ 16 సమయంలో “శ్రీ” సినిమాలో నటించి హీరోయిన్‌గా మారింది.దీని తర్వాత హ్యాపీడేస్ (2007) మూవీతో ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Telugu Avika Gor, Charmi Kaur, Age, Hansika, Cine, Krithi Shetty, Tamanna, Tolly

• హన్సిక మోత్వాని

మిల్కీ బ్యూటీ హన్సిక మోత్వాని( Hansika Motwani ) “దేశముదురు” సినిమాతో హీరోయిన్ అయిన సంగతి తెలిసిందే ఈ మూవీ రిలీజ్ అయ్యే నాటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లే.దీని తర్వాత హన్సిక మస్కా, కంత్రి లాంటి సినిమాల్లో నటించి అలరించింది.

Telugu Avika Gor, Charmi Kaur, Age, Hansika, Cine, Krithi Shetty, Tamanna, Tolly

• అవికా గోర్

బబ్లీ గర్ల్ అవికా గోర్( Avika Gor ) 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించింది.ఈ సినిమాలో నటించే సమయానికి ఆమెకు కేవలం 16 ఏళ్లు మాత్రమే ఉన్నాయి.సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాల్లో కూడా ఈ బ్యూటీ నటించింది.

ప్రస్తుతం ఈ అందాల తార వయసు కేవలం 27 ఏళ్లు మాత్రమే.అయినా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె ఫేడౌట్ అయింది.

Telugu Avika Gor, Charmi Kaur, Age, Hansika, Cine, Krithi Shetty, Tamanna, Tolly

• శ్వేతా బసు ప్రసాద్

ఈ అల్లరి పిల్ల 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే “కొత్త బంగారులోకం” సినిమాలో నటించి మెప్పించింది.

Telugu Avika Gor, Charmi Kaur, Age, Hansika, Cine, Krithi Shetty, Tamanna, Tolly

• కృతి శెట్టి

అందాల తార కృతి శెట్టి( Krithi Shetty ) ఉప్పెన సినిమాతో బేబమ్మ పాత్ర ద్వారా పరిచయమైంది.ఈ సినిమా చేసే సమయానికి ఆమెకు 27 ఏళ్ల వయసు ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube