ఇదేందయ్యా ఇది.. అది కారా.. లేక గూడ్స్ రైలా..?

సాధారణంగా మనము ఒక్కోసారి బైక్ పై ఐదు నుంచి ఆరు మంది వరకు ప్రయాణం చేయడం సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం.అయితే కొన్ని సందర్భాలలో ఐదు సీట్ల కెపాసిటీ ఉన్న కారులో కూడా పది మంది అంతకు మించి ప్రజలు కలిసి ప్రయాణించడం కూడా చూసాం.

 Sticks And Camel Alto Car Viral On Social Media, Man, Carries ,camel ,alto Car-TeluguStop.com

అయితే, ఒక వ్యక్తి తన కారును గూడ్స్ రైలుగా మార్చేశాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media)లో తెగ వైరల్ గా మారింది.ఈ వీడియోలో కారుపై వేసిన లోడును చూస్తే ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవ్వాల్సిందే.అంత బరువును ఆ కారు మొస్తుందో లేదో, ఎలా ముందుకు వెళ్తుందో.

అని అర్థమవ్వక నెటిజన్లు సతమతమవుతున్నారు.అలాగే.

, ఆ కారులో ఒక ఒంటె( Camel ) కూడా కూర్చోవడం అసలు విశేషం.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఆధారంగా కారుపై కప్పు మీద పెద్ద మొత్తంలో పొడవాటి కర్రలు, పెద్ద పెద్ద బస్తాలు కట్టిన మూటలు ఉండడం గమనించ వచ్చు.అలాగే వాటిపై కొందరు మనుషులు కూడా కూర్చొని ప్రయాణం చేయడం మనం చూడవచ్చు.

ఇక్కడ ఆచ్చర్యమైన విషయం ఏమిటంటే.ఒంటె కూడా కారులో ఉండడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ ప్రపంచంలో అసాధ్యం అనేది ఏదీ లేదని కామెంట్స్ చేస్తున్నారు.అలాగే.

, ఈ వీడియో చూసిన ఒక వ్యక్తి ఫన్నీగా రిప్లై ఇస్తూ.ఈ వ్యక్తి మొదట ఒంటెను కూర్చోబెట్టి, ఆపై కారును తయారు చేసి ఉండాలి అంటూ కామెంట్స్ చేశారు.

అలాగే ఇక మరికొందరు అయితే.ఇది కారు కాదు గురూ.

ఇది గూడ్స్ రైలు( Goods Train ) అంటూ కామెంట్ చేశారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసి మీకేమనిపించిందో ఒక కామెంట్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube