కేంద్రంలో బిజెపి( BJP ) అధికారంలో ఉన్నా. తెలంగాణలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి గజిబిజి గందరగోళం అన్నట్లుగా ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చినా. ఎన్నికల ఫలితాలలో ఊహించని విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం , రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉండడంతో మూడో స్థానానికి బిజెపి పరిమితం అయింది.
ఎప్పటికైనా తెలంగాణలో అధికారంలోకి వస్తామనే ధీమా ను వ్యక్తం చేస్తున్నా , అందుకు తగ్గట్లుగా కార్యాచరణ చేపట్టకపోవడం వంటివన్నీ ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.తెలంగాణలో అధికార కాంగ్రెస్ , ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య పోరు జరుగుతున్నా, బిజెపి మాత్రం సైలెంట్ గా ఉంటోంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఏదో ఒక అంశంతో జనాల్లోకి వెళ్తుండగా బిజెపి మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయలేకపోతోంది.దీంతో బిజెపి గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గుతున్నట్టుగానే కనిపిస్తోంది.
క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేసి, జనాలకు దగ్గరయ్యేందుకు ఏం చేయాలనే దానిపైన ఆ పార్టీ నేతలకు ఒక క్లారిటీ రావడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బిజెపి నేతలు వ్యవహరిస్తున్న తీరు పార్టీ క్యాడర్ లోనూ గందరగోళానికి కారణం అవుతోంది.తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. విడతల వారీగా మూడుసార్లు రుణమాఫీ చేసింది.
రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు 15వ తేదీ లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. కానీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్( BRS ) మాత్రం రుణమాఫీ పూర్తిగా జరగలేదంటూ నియోజకవర్గాల స్థాయిలో ఆందోళనలకు దిగింది .
గత ఎన్నికల్లో గ్రామాల్లో పట్టు కోల్పోయిన బీఆర్ఎస్ రైతుల మద్దతుతో మళ్ళీ బలం పెంచుకోవాలని చూస్తోంది.దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi )ని పిలిచి రుణమాఫీ పై సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.ఈ విధంగా అటు బీ, కాంగ్రెస్లు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రజల్లో కి వెళ్తున్నా .బిజెపి మాత్రం ఆ తరహా ప్రయత్నాలు ఏవి చేయడం లేదు. కేవలం మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, స్టేట్మెంట్లతో నేతలు సరిపెట్టేస్తున్నారు.హైదరాబాద్ నగర పరిధిలోని అక్రమ కట్టడాల కూల్చివేత చేపడుతున్న హైడ్రా విషయంలోనూ బిజెపి నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.
బిజెపి ఎంపీలు కొండ విశ్వేశ్వర్ రెడ్డి , రఘునందన్ రావు వంటి వారు హైడ్రా కూల్చివేతలను సమర్థిస్తూ. పరోక్షంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థిస్తుండగా మల్కాజి గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ హైడ్రా కూల్చివేతలను తప్పుపడుతున్నారు .ఈ విధంగా పార్టీలోని నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ ఉండడం వంటివి ఆ పార్టీలోని గందరగోళాన్ని తెలియజేస్తున్నాయి
.