అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ అభ్యర్ధి , ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్( Kamala Harris)కు మద్ధతు పెరుగుతోంది.నల్లజాతి, భారత సంతతి, దక్షిణాసియా సమాజాలు ఇప్పటికే కమల వెంట నడుస్తుండగా.
డెమొక్రాటిక్ పార్టీలోని సీనియర్ నేతలు ఆమెకు జై కొడుతున్నారు.తాజాగా స్టార్ సింగర్, గ్రామీ అవార్డ్ విజేత టేలర్ స్విఫ్ట్ కూడా కమలా హారిస్‌ను ఎండార్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
నాలుగు నుంచి ఆరు వారాల్లోగా ఆమె తన నిర్ణయం తెలియజేయనున్నారని టాక్.వైట్‌హౌస్‌లో బలమైన మహిళను చూడాలనే కోరికతో హారిస్‌కు మద్ధతు ఇవ్వడానికి టేలర్ ఆసక్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.2020 అధ్యక్ష ఎన్నికల్లోనూ టేలర్ .బైడెన్ – హారిస్‌కు మద్ధతు ఇచ్చారు.
14 సార్లు గ్రామీ అవార్డ్( Grammy Award ) పొందిన టేలర్ .గతంలో పలుమార్లు డెమొక్రాటిక్ పార్టీకి మద్ధతిచ్చిన చరిత్ర ఉంది.స్విప్ట్‌కున్న అశేష అభిమాన గణం అమెరికా ఎన్నికల్లో ప్రభావం చూపించగలదని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు.ఈ జనరేషన్‌లో స్విఫ్ట్ అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు.
అందుకే బైడెన్ – ట్రంప్ శిబిరాలు ఆమె మద్ధతును కోరాయి.కానీ ఇప్పటి వరకు టేలర్ స్విఫ్ట్ తన నిర్ణయాన్ని బహిరంగం ప్రకటించలేదు.
అయితే బైడెన్( Joe Biden) తప్పుకుని కమలా హారిస్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి అయినందున … అమెరికా చరిత్రలోనే మొదటి మహిళా అధ్యక్షురాలిగా మారే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో టేలర్ ఆమె వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.
2020లో కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు టేలర్ స్వాగతించారు.ఒక మహిళ అమెరికాలో ఇంతటి ఉన్నతమైన రాజకీయ హోదాలో ఉండటం చాలా పెద్ద విషయమని ఆమె తన స్నేహితుల వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.ఎలాన్ మస్క్ వంటి టెక్ దిగ్గజాల నుంచి కార్పోరేట్ ప్రపంచం మొత్తం డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గుచూపుతోంది.
అయితే సిలికాన్ వ్యాలీ, హాలీవుడ్ వర్గాలు కమలా హారిస్‌కు జైకొడుతున్నాయి.