మనలో ఎంతో మందికి శరీరం మొత్తం నాజూగ్గా ఉన్న పొట్ట వద్ద మాత్రం కొవ్వు పేరుకుపోయి లావుగా కనిపిస్తుంది.గంటలు తరబడి కూర్చుని ఉండడం, కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడం, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి తదితర కారణాల వల్ల పొట్ట చుట్టూ ఫ్యాట్( Belly fat ) ఏర్పడుతుంది.
పొట్ట లావుగా తయారవుతుంది.బాడీ షేప్ అవుట్ అవుతుంది.
ఈ క్రమంలోనే పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే ఫ్రూట్ జ్యూసులు చాలా బాగా సహాయపడతాయి.ఫ్యాట్ బర్నర్స్ గా ఇవి పనిచేస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫ్రూట్ జ్యూసులు ఏవేవో తెలుసుకుందాం పదండి.
పైనాపిల్ జ్యూస్( Pineapple Juice ).బెల్లీ ఫ్యాట్ తో బాధపడే వారికి బెస్ట్ వన్ గా చెప్పుకోవచ్చు.పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది.ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.బొడ్డు కొవ్వును సమర్థవంతంగా కరిగిస్తుంది.
అలాగే పుచ్చకాయ జ్యూస్( Watermelon juice) ఫ్యాట్ కట్టర్ గా పని చేస్తుంది.ఎందుకంటే ఇది హైడ్రేటింగ్, తక్కువ కేలరీలు, అమైనో ఆమ్లాలు మరియు లైకోపీన్లను కలిగి ఉంటుంది.ఇవి జీవక్రియను పెంచుతాయి.
కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి.మరియు బరువు తగ్గే ప్రక్రియను సైతం వేగవంతం చేస్తాయి.
ద్రాక్ష రసం పొట్ట కొవ్వును కాల్చడానికి సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి.ఒక చిన్న గ్లాసు ద్రాక్ష రసం తాగడం వల్ల బాన పొట్ట ఫ్లాట్ అవుతుంది.
నిద్రలేమి సమస్య ఉంటే దూరం అవుతుంది.రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
హృదయ ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్.
లెమన్ జ్యూస్.ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో లెమన్ జ్యూస్, దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ కు బై బై చెప్పవచ్చు.