జలుబు ఉక్కిరిబిక్కిరి చేస్తుందా.. రెండు రోజుల్లో వదిలించుకోండిలా!

ప్రస్తుత వర్షాకాలంలో దాదాపు అందర్నీ చాలా కామన్ గా ఇబ్బంది పెట్టే సమస్యల్లో జలుబు( cold ) ముందు వరుసలో ఉంటుంది.జలుబు కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.

 Taking This Drink Will Keep Cold Away! Cold, Cold Relief Tips, Cold Relief Remed-TeluguStop.com

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.పైగా జలుబు వల్ల తలనొప్పి, చిరాకు తారాస్థాయిలో ఉంటాయి.

మీరు కూడా జలుబుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా.? అయితే అస్సలు వర్రీ అవకండి.

Telugu Remedy, Tips, Herbal, Latest, Monsoon-Telugu Health

ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ కనుక తీసుకుంటే కేవలం రెండు రోజుల్లోనే జలుబును వదిలించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ పవర్ ఫుల్ డ్రింక్ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా అంగుళం అల్లం ముక్క తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక అల్లం తురుము, ఐదు ఫ్రెష్ తులసి ఆకులు మరియు ఐదు ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint leaves) వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Remedy, Tips, Herbal, Latest, Monsoon-Telugu Health

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసి తేనె కలిపి సేవించాలి.రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈ హెర్బల్ డ్రింక్ ను కనుక తాగితే సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా అల్లం, పుదీనా, తులసి లో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.

ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరాన్ని తయారు చేస్తాయి.జలుబు, దగ్గు వంటి సమస్యలను చాలా వేగంగా తరిమి కొడతాయి.పైగా తలనొప్పికి కూడా ఈ డ్రింక్ న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ డ్రింక్ తాగితే క్షణాల్లో రిలీఫ్‌ పొందుతారు.

మైండ్ రిలాక్స్ అవుతుంది.కాబట్టి జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హెర్బల్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube