మందులతో అవసరం లేకుండా జలుబు, దగ్గు సమస్యలకు ఈజీగా చెక్ పెట్టండిలా!

ప్రస్తుత చలికాలంలో జలుబు, దగ్గు( Cold, cough ) వంటి సమస్యలు ఎంతలా ఇబ్బంది పెడతాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ జలుబు, దగ్గుకు గురవుతుంటారు.

 Easily Check Cold And Cough Problems Without The Need For Medicines! Herbal Drin-TeluguStop.com

ఇవి చిన్న సమస్యలుగానే అనిపించినా తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంటాయి.ఒక్కోసారి జలుబు, దగ్గు కారణంగా జ్వరం కూడా వచ్చేస్తుంటుంది.

ఈ క్రమంలోనే ఆయా సమస్యలను వదిలించుకునేందుకు మందులు వాడుతుంటారు.అయితే మందులతో అవసరం లేకుండా సాధారణ జలుబు, దగ్గు సమస్యలకు ఇంట్లోనే ఈజీగా చెక్‌ పెట్టవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ డ్రింక్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

Telugu Cough, Easilycough, Tips, Healthy, Latest-Telugu Health

ముందుగా అర అంగుళం పచ్చి పసుపు కొమ్మును తీసుకుని శుభ్రంగా క‌డిగి సన్నగా తురుముకుని పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ ( A glass of water )పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అందులో పసుపు తురుము, నాలుగు లవంగాలు ( Four cloves )మరియు అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ) వేసి దాదాపు 8 నుంచి 10 నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టీ స్పూన్ ఆర్గానిక్ హనీ మిక్స్ చేసుకుని సేవించాలి.

Telugu Cough, Easilycough, Tips, Healthy, Latest-Telugu Health

జలుబు దగ్గు నివారణలో ఈ డ్రింక్ ఎంతో పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.ఈ డ్రింక్ లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి.రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా మారుతుంది.

జలుబు, దగ్గు వంటి సమస్యలు పరార్ అవుతాయి.అంతేకాకుండా ఇదొక ఫ్యాట్ కట్టర్ డ్రింక్ లాగా కూడా పనిచేస్తుంది.

నిత్యం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.అధిక బరువు సమస్య నుంచి బయటపడడానికి తోడ్పడుతుంది.

అంతే కాకుండా ఈ డ్రింక్ కీళ్ల నొప్పుల నుంచి రిలీఫ్ ను కూడా అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube