నీరసాన్ని తరిమికొట్టే బెస్ట్ ఎనర్జీ బూస్టర్ లడ్డూ ఇది.. తప్పక డైట్ లో చేర్చుకోండి!

నీరసం శరీరాన్ని ఎంతలా ఉక్కిరి బిక్కిరి చేసేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.పైగా ఒక్కోసారి నీరసం పట్టుకుంది అంటే ఓ పట్టాన వదిలిపెట్టదు.

 This Is The Best Energy Booster Laddu To Chase Away Fatigue! Fatigue, Energy Boo-TeluguStop.com

నీరసం కారణంగా కొందరు చాలా ఇబ్బంది పడుతుంటారు.ఏ పని చేసుకోలేక అడుగు తీసి అడుగు వేయలేక సతమతం అవుతుంటారు.

అయితే నీరసాన్ని తరిమికొట్టే బెస్ట్ ఎనర్జీ బూస్టర్ లడ్డూ ఒకటి ఉంది.ఈ లడ్డూను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే నీరసం పరార్ అవ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

లడ్డూ తయారీ కోసం.మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు( Sesame seeds ), అర కప్పు వేయించి పొట్టు తొలగించిన పల్లీలు( peanuts ) వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత అందులో అరకప్పు వేయించుకున్న ఎండు కొబ్బరి( Dry coconut ), ఒక క‌ప్పు బెల్లం తురుము( Grate jaggery ), వన్ టీ స్పూన్ యాలకుల పొడి మరియు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న లడ్డూల మాదిరి చుట్టుకుని స్టోర్ చేసుకోవాలి.

Telugu Energybooster, Tips, Healthy Laddu, Latest, Sesameseeds-Telugu Health

ఈ నువ్వుల పల్లీల లడ్డు తినడానికి రుచికరంగానే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ఈ లడ్డు శరీరానికి సహజ శక్తిని చేకూరుస్తుంది.నీరసం, అలసట వంటి సమస్యలను తరిమి కొడుతుంది.రోజుకొకటి ఈ లడ్డూను తింటే నీరసం అన్న మాటే అనరు.అలాగే ఈ నువ్వుల పల్లీల లడ్డులో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను నియంత్రించడంలో మరియు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.నియాసిన్ మరియు విటమిన్ ఇ వంటి పోష‌కాలు అల్జీమర్స్ వ్యాధి మరియు వయస్సు-సంబంధిత అభిజ్ఞా క్షీణత నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

Telugu Energybooster, Tips, Healthy Laddu, Latest, Sesameseeds-Telugu Health

అంతేకాకుండా ఈ ల‌డ్డూలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి, ఇది బలమైన ఎముకలను అభివృద్ధి చేయడానికి తోడ్ప‌డ‌తాయి.మెండుగా ఉండే ఐరన్ కంటెంట్ ర‌క్త‌హీన‌త‌ను నివారించడంలో హెల్ప్ చేస్తుంది.ఈ నువ్వుల ప‌ల్లీల ల‌డ్డూలో విటమిన్లు మరియు ఖనిజాలు చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube