గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హీరోయిన్ కీర్తి సురేష్ (heroine keerthy sureshs)పేరు పెద్ద ఎత్తున వినిపిస్తున్న విషయం తెలిసిందే.తరచూ ఏదో ఒక విషయంతో ఈమె పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.
మొన్నటి వరకు పెళ్లి వార్తల్లో నిలుస్తూ వచ్చిన ఈమె ఆ తర్వాత ఆమె నటించిన బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా వార్తల్లో నిలుస్తూ వచ్చిన విషయం తెలిసిందే.పెళ్లి అయిన వెంటనే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడంతో అందరూ ఆమెను పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపించారు.
కీర్తి సురేష్ (keerthy sureshs)తన చిరకాల మిత్రుడు ఆంథోనీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు పెళ్లి తర్వాత ఈమె సినిమా ఇండస్ట్రీకి (film industry)దూరం కాబోతుందని సినిమాలకు గుడ్ బై (good Bye)చెప్పబోతోంది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కీర్తి సురేష్ తాజాగా నటించిన బేబీ జాన్ (Baby John)సినిమాకు పెద్దగా హిట్ టాక్ రాకపోవడంతో ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న మరో రెండు ప్రాజెక్టులు పూర్తిచేసి ఆ తర్వాత సినిమాలకు దూరం కాబోతోంది అన్న వార్త వైరల్ గా మారింది.కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి సంసార జీవితానికే పరిమతమవాలని ఆమె భావిస్తోందట.
దీంతో కీర్తి ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఈ వార్తలో నిజానిజాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.మరి ఈ వార్తలపై మహానటి కీర్తి సురేష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.ఈ విషయం పట్ల అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.మొదటి నేను శైలజ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తర్వాత వరుసగా అవకాశాలు అంటుకుంటూ భారీగా గుర్తింపును తెచ్చుకుంది.మహానటి సినిమాతో భారీగా ఫేమ్ ని సంపాదించుకుంది.
స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ కూడా ఉన్నారు.
తెలుగుతోపాటు హిందీలో కూడా ఈ ముద్దుగుమ్మకు బాగానే అభిమానులు ఉన్నారని చెప్పాలి.