ఇప్పటికైనా మారకపోతే కష్టం రామ్.. అలాంటి సినిమాలు నీ ఇమేజ్ కు అవసరమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు( Ram ) ప్రత్యేక గుర్తింపు ఉంది.దేవదాస్ , రెడీ, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో రామ్ విజయాలను అందుకున్నారు.

 Hero Ram Need To Change In Movie Selection Details, Ram, Hero Ram, Ram Pothineni-TeluguStop.com

అయితే రామ్ సక్సెస్ సాధించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు క్లాస్ సినిమాలే కావడం గమనార్హం.అయితే ఈ మధ్య కాలంలో రామ్ ఎక్కువగా మాస్ సినిమాలలో నటించగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.

డబుల్ ఇస్మార్ట్( Double Ismart ) సినిమాతో రామ్ సక్సెస్ సాధిస్తారని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.ఇప్పటికైనా రామ్ మారకపోతే ఎలా అని మాస్ సినిమాలు( Mass Movies ) రామ్ ఇమేజ్ కు అవసరమా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రామ్ కోరుకున్న విజయాలు దక్కాలంటే నవ్యత ఉన్న కథాంశాలను ఎంచుకుని బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Telugu Double Ismart, Ram, Ismart Shankar, Ram Flop, Ram Mass, Ram Pothineni-Mov

రామ్ పదేపదే ఒకే తరహా పొరపాట్లు చేస్తే ఎలా అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.రామ్ పారితోషికం 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది.రామ్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని భావిస్తున్నా ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో సఫలం కావడం లేదు.

రామ్ రేంజ్ కు తగ్గ విజయాలు అయితే దక్కడం లేదని ఫ్యాన్స్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Double Ismart, Ram, Ismart Shankar, Ram Flop, Ram Mass, Ram Pothineni-Mov

రామ్ సినిమాలు( Ram Movies ) భారీ హైప్ తో విడుదలవుతున్నా నిర్మాతలకు మాత్రం రికార్డ్ స్థాయిలో నష్టాలు వస్తున్నాయి.ఫస్ట్ వీకెండ్ తర్వాత భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించడంలో రామ్ ఫీలవుతున్నారు. రామ్ కెరీర్ కు సంబంధించి చేస్తున్న పొరపాట్లు ఆయన కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రామ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.రాబోయే రోజుల్లో రామ్ రేంజ్ మరింత పెరగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube