అతి చిన్న వయస్సులో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా శ్రీలీల( Srilila ) స్టార్ స్టేటస్ ను అందుకుంది.టాలీవుడ్‌లో ఇప్పటికే ఉన్న అనేకమంది అగ్రకథనాయకులతో నటించి మెప్పింది.” పెళ్లి సందడి ” సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన తర్వాత శ్రీలీల వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ స్టేటస్ ను పొందింది.ఇకపోతే శ్రీలీలకు వరుసగా హిందీ, తమిళ సినిమాలలో అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే., అతి త్వరలో కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో( Kollywood film industry ) శ్రీలీల కనిపించనున్నట్లు తెలిసింది.
తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా తమిళ ప్రాజెక్టులో శ్రీలీల నటించనున్నట్లు సమాచారం.

ఇకపోతే ‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’, ‘డాన్’, ‘ప్రిన్స్’ ( ‘Remo’, ‘Varun Doctor’, ‘Don’, ‘Prince’ )లాంటి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు శివకార్తికేయన్.ఇక ఈయన ‘పురాణనూరు’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులని పలకరించనున్నాడు.జాతీయ పురస్కార గ్రహిత ‘ఆకాశం నీ హద్దురా’ ఫేమ్ సుధాకొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్, శ్రీలీల నటించనున్నారు.
సినిమాకు సంబంధించి ఈ మధ్యనే హీరో హీరోయిన్లపై ఫోటో షూట్ కూడా జరిగిందట.అతి త్వరలోనే సినిమా బృందం ఈ సినిమా పై క్లారిటీ ఇవ్వనున్నారు.ఇకపోతే బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు నటించనుంది.బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ మల్హోత్రాతో నటించే అవకాశాన్ని శ్రీలీల కొట్టేసింది.
అలాగే మరోవైపు బల్విందర సింగ్ దర్శకత్వంలో ‘మిట్టి’ ( Mitti )సినిమాలో హీరోయిన్ గా కూడా శ్రీలీలకు ఆఫర్ వచ్చిందని సమాచారం.

ఇక ఈ సంవత్సరం మొదట్లో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కనపడిన శ్రీలీల.నితిన్ హీరో నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా, అలాగే పవన్ కళ్యాణ్ నటించబోయే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లోను నటించనుంది.








